బాయ్ ఫ్రెండ్ బైక్ లో వెలుతున్న మాజీ గర్ల్ ఫ్రెండ్, ఫస్ట్ ప్రియుడి ఎంట్రీతో సీన్ !
పూణే/ముంబాయి: 20 ఏళ్ల కాలేజీ అమ్మాయిని 21 ఏళ్ల కాలేజ్ యువకుడు నడిరోడ్డులో ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించాడు, చేతిలో కత్తి పట్టుకుని ఆమెను రోడ్డుపై వెంబడించి చంపడానికి విఫలయత్నం చేశాడు. ఈ సమయంలో యువతికి సాయంగా వచ్చిన స్థానికులు కాలేజ్ అమ్మాయిని హత్య చెయ్యడానికి ప్రయత్నించిన యువకుడిని పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.
ఈ ఘటన మహారాష్ట్రలోని పూణే సిటీలోని సదాశివపేటలో చోటుచేసుకుంది. కాలేజ్ అమ్మాయిని చంపడానికి ఓ యువకుడు కత్తితో వెంబడిస్తున్న దృశ్యాలు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఆ సీసీటీవీ వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉదయం 10 గంటలకు విష్రాంబాగ్ పోలీస్ స్టేషన్‌లోని పెరుగేట్ పోలీస్ చౌకీ సమీపంలో ఈ ఘటన జరగడంతో స్థానిక ప్రజలు హడలిపోయారు.

ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. బాయ్ ఫ్రెండ్ తో కలిసి బైక్‌పై వెనుక కూర్చున్న యువతి కళాశాలకు బయలుదేరింది. మార్గం మధ్యలో కాలేజ్ అమ్మాయి మాజీ బాయ్ ఫ్రెండ్ శంత లక్ష్మణ్ జావెద్ అలియాస్ లక్ష్మణ్ జావెద్ కాలేజ్ అమ్మాయి వెంటపడ్డాడు. తనతో మాట్లాడాలని యువతికి చెప్పి బైక్‌ను వెంబడించాడు. పదేపదే వెంటపడుతున్న లక్ష్మణ్ జావెద్ ఆమెను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు.
కాలేజ్ యువతి ప్రయాణిస్తున్న బైక్ ను అడ్డగించిన లక్ష్మణ్ జావెద్ ఆమెతో మాట్లాడాలని గొడవ చేశాడు. ఆ సమయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. వెంటనే లక్ష్మణ్ జాదెవ్ అతని బ్యాగులో దాచుకున్న కత్తి తీసుకుని కాలేజ్ అమ్మాయితో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ మీద దాడికి దిగాడు. ముందుగా యువకుడిని తరిమికొట్టి ఆ తర్వాత యువతిని వెంబడించాడు.
తప్పించుకునే ప్రయత్నంలో యువతి కాలుజారి పడిపోయింది. అక్కడ గుమిగూడిన ప్రజలు పరుగున వచ్చి లక్ష్మణ్ జావెద్ ను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. నిందితుడు లక్ష్మణ్ జావెద్ ను విచారణ చేస్తున్నామని విశ్రామ్ బాగ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ పోలీసు అధికారి స్థానిక మీడియాకు తెలిపారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications