Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

girlfriend: కాలేజ్ ప్రియురాలు, వేరే అబ్బాయితో, ఇన్ స్టాగ్రామ్ లో వీడియోలు చూసిన ప్రియుడు?

కాలేజ్ లో చదువుతున్న ప్రియురాలు వేరే అబ్బాయితో చనువుగా ఉంటున్నదని తెలుసుకున్న ఆమె కాలేజ్ ప్రియుడు రగిలిపోయాడు.

జార్ఖండ్: కాలేజ్ లో చదువుతున్న ప్రియురాలు వేరే అబ్బాయితో చనువుగా ఉంటున్నదని తెలుసుకున్న ఆమె కాలేజ్ ప్రియుడు రగిలిపోయాడు. ప్రియురాలిని దారుణంగా మైనర్ ప్రియుడు హత్య చెయ్యడం కలకలం రేపింది. జార్ఖండ్‌లోని గోదా జిల్లా ఉర్జానగర్‌లోని ఓ ఇంగ్లీస్ మీడియం కాలేజ్ లో 12వ తరగతి (ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని, అదే కాలేజ్ లో ఆమెతో పాటు చదువుతున్న మరో అబ్బాయి ప్రేమించుకున్నారు. తరువాత ప్రియురాలు మరో అబ్బాయితో క్లోజ్ గా ఉండటంతో అక్కడ అసలు కథ మొదలైయ్యింది.

హోలి రోజు?

హోలి రోజు?

అమ్మాయి ప్రియుడు గోవిందాపూర్ ప్రాంతానికి చెందినవాడు. గత బుధవారం దేశవ్యాప్తంగా హోలీ పండుగ జరుపుకున్న వియం తెలిసిందే. ఆ రోజు ప్రియురాలు సాటి స్నేహితులతో కలిసి హోలీ జరుపుకునేందుకు ఇంటి నుంచి బయలుదేరి వెళ్లింది. సాయంత్రం అయినా ఆ విద్యార్థిని ఇంటికి రాకపోవడంతో అమ్మాయి తల్లిదండ్రులు ఆమె సెల్‌ఫోన్‌ కు ఫోన్ చేసి మాట్లాడటానికి ప్రయత్నించారు.

పొలంలో శవమైన కాలేజ్ అమ్మాయి

పొలంలో శవమైన కాలేజ్ అమ్మాయి

ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో భయాందోళనకు గురైన తల్లిదండ్రులు మొదట స్నేహితులు, బంధువులు, తెలిసిన వాళ్లకు ఫోన్ చేసి కూతురి గురించి ఆరా తీశారు. చివరికి మా కూతురు కనపడటం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కాలేజ్ అమ్మాయి కోసం గాలించారు. ఆ సందర్భంలో ఊరి బయట పొలంలో పోలీసులు బాలిక మృతదేహం గుర్తించారు.

 శవం పక్కనే సెల్ ఫోన్, ఇనుప రాడ్

శవం పక్కనే సెల్ ఫోన్, ఇనుప రాడ్

మృతదేహాన్ని వెలికితీసి దర్యాప్తు చెయ్యగా ఆ శవం 12వ తరగతి చదువుతున్న విద్యార్థినిది అని తేలింది. విద్యార్థిని శవమై కనిపించిన చోట ఆమె సెల్ ఫోన్, హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్ లభ్యమయ్యాయి. పోలీసులు అమ్మాయి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు ప్రారంభించారు.

కాలేజ్ లో ప్రియుడు

కాలేజ్ లో ప్రియుడు

పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. కాలేజ్ విద్యార్థిని తోటి విద్యార్థితో రొమాంటిక్ రిలేషన్ షిప్ లో ఉందని వెలుగు చూసింది. కాలేజ్ అమ్మాయి ఇన్ స్టాగ్రామ్ లో మరో విద్యార్థితో (ప్రియుడు కాదు) ఎక్కువగా టచ్ లో ఉందని ఆమె ప్రియుడు గుర్తించాడు. ఇదే విషయంలో ప్రియుడికి అతని ప్రియురాలి మీద కోపం వచ్చింది.

వేరే అబ్బాయితో ప్రియురాలు?

వేరే అబ్బాయితో ప్రియురాలు?

హోలీ పండుగ సందర్భంగా బయటకు వచ్చిన విద్యార్థినిని అడ్డుకున్న ప్రియుడు ఇన్‌స్టా టాక్‌పై వాగ్వాదానికి దిగాడు. ఆవేశంతో ప్రియురాలిని చేతిలోని ఇనుప రాడ్‌తో కొట్టాడు. ప్రియుడి దాడిలో అతని ప్రియురాలు స్పాట్ లో చనిపోయింది. పోలీసుల విచారణలో ప్రియుడు అతని ప్రియురాలిని హత్య చేసినట్లు అంగీకరించాడు. ప్రియుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు అన్నారు. కాలేజ్ అమ్మాయిని ఆమె మైనర్ ప్రియుడు హత్య చెయ్యడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+