బెడ్ రూమ్ లోనే తల్లిని స్పాట్ లో చంపేసిన కొడుకు, కోపంతో కాలేజ్ స్టూడెంట్ ?
చిన్న కారణంతో తల్లిని ఇనుప రాడ్‌తో కొట్టి చంపేసిన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరు నగరంలోని కేఆర్ పురంలోని భీమయ్య లేఅవుట్‌లో జరిగిన ఈ ఘటనతో ఐటీ హబ్ ప్రజలు హడలిపోయారు. నేత్రావతి (40) అనే మహిళ ఆమె కన్న కొడుకు చేతిలోనే హత్యకు గురైన దురదృష్టవంతురాలు అని బెంగళూరులోని వైల్ ఫీల్డ్ డీసీపీ శివకుమార్ శనివారం మీడియాకు చెప్పారు.
శనివారం ఉదయం నేత్రావతి ఆమె కొడుకు చేతిలో హత్యకు గురైయ్యింది. కోలారు జిల్లాలోని ములబాగిలు పట్టణంలోని ఓ కాలేజ్ లో డిప్లొమా చేస్తున్న నేత్రావతి కొడుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు అంటున్నారు డీసీపీ శివకుమార్ చెప్పిన వివరాల ప్రకారం తల్లి నేత్రావతిని హత్య చేసిన ఆమె కొడుకు నేరుగా కేఆర్ పురం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. శుక్రవారం సాయంత్రం మళబాగిల్ లో కాలేజ్ పూర్తి చేసుకున్న నేత్రావతి కొడుకు తరువాత కేఆర్ పురంలోని ఇంటికి వచ్చాడు.

కేఆర్ పురంలో ఇంటికి వచ్చిన కొడుకు అతని తల్లి నేత్రావతితో గొడవపడి భోజనం చేయకుండా నిద్రపోయాడు. దీంతో మనస్తాపానికి గురైన నేత్రావతి కొడుకు మీద ఆగ్రహం వ్యక్తం చేసి ఆమె నిద్రపోయింది. శనివారం ఉదయం ముళబాగిల్ లోని కాలేజీకి వెళ్లేందుకు సిద్ధమైన కొడుకు తనకు టిఫిన్ వడ్డించమని తల్లి నేత్రావతిని కోరాడు. ఈ సమయంలో నేత్రావతి కొడుకును తిట్టినట్లే పోలీసులు చెబుతున్నారు.
ఆ సమయంలో అల్పాహారం ఎందుకు చేయలేదని, ముందే చెప్పి ఉంటే తాను బయటకు వెళ్లి తినేవాడినని కొడుకు అతని తల్లి నేత్రావతితో గొడవ పడ్డాడు. నువ్వు నా కొడుకువి కాదని, నువ్వు రోడ్డు మీద చిక్కితే తెచ్చి పెంచుకుంటున్నామని నేత్రావతి ఆవేశంలో ఆమె కొడుక్కి చెప్పిందని పోలీసులు అంటున్నారు. ఇక మీదట నేను నీకు నీకు తిండి పెట్టలేనని, నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవాలని నేత్రావతి తమాషాకు అతని కొడుక్కి చెప్పందని తెలిసింది.

దీంతో కోపోద్రిక్తుడైన కొడుకు ఇంట్లోని ఇనుప రాడ్ తీసుకుని బెడ్ రూమ్ లో నిద్రిస్తున్న తల్లి తలపై కొట్టాడు. ఇనుప రాడ్ తో దాడి చెయ్యడంతో నేత్రావతి తల పగిలిపోయి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తల్లినేత్రావతిని హత్య చేసిన ఆమె కొడుకు నేరుగా కేఆర్ పురం పోలీస్ స్టేషన్ కు వెళ్లిలొంగిపోయాడు. ఈ ఘటనపై కేఆర్ పురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ముల్‌బాగిలుకు చెందిన నేత్రావతి కుటుంబం గత గత 30 ఏళ్ల క్రితం బెంగళూరులోని కేఆర్ పురం చేరుకుని భీమయ్య లేఅవుట్‌లో నివసిస్తోంది. నేత్రావతి భర్త చంద్ర శనివారం ఉదయం ముళబాగిల్ కు వెళ్లిన తరువాత ఈ ఘటన చోటుచేసుకుందని డీసీపీ శివకుమార్ తెలిపారు. అయితే కాలేజ్ స్టూడెంట్ తల్లిని హత్య చెయ్యడానికి వేరే కారణాలు ఉంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications