బీఎస్ఎన్ఎల్ అధికారుల టార్చర్ తో పెట్రోల్ పోసుకుని దంపతులు ఏం చేశారంటే, ఏదో అనుకుంటే ?
బెంగళూరు/తుమకూరు: వ్యాపారం చేస్తున్న దంపతులు డబ్బులు సంపాధించి సంతోషంగా ఉండాలని అనుకున్నారు. అప్పులు చేసి వ్యాపారం చేస్తున్నారు. అప్పు ఇచ్చి వాళ్లకు సరైన సమయంలో దంపతులు డబ్బులు తిరిగి చెల్లిస్తున్నారు. అయితే లక్షలాది రూపాయల బిల్లులు పెండింగ్ పెట్టుకున్న బీఎస్ఎన్ఎల్ అధికారులు మమ్మల్ి టార్చర్ పెడుతున్నారని ఆరోపిస్తూ అదే బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ముందే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు.
బీఎస్‌ఎన్‌ఎల్ అధికారుల వేధింపులు తాళలేక దంపతులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కర్ణాటకలోని తుమకూరులోని అశోకా రోడ్డులోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం ఎదుట చోటుచేసుకుంది. తుమకూరు జిల్లాలోి గుబ్బికి చెందిన నాగరాజ్, అతని భార్య నాగరత్న దంపతులు ఆత్మహత్యకు యత్నించారని తుమకూరు పోలీసులు తెలిపారు.

గత 15 ఏళ్లుగా నాగరాజ్ జయంత్ కేబుల్ నెట్‌వర్క్ అండ్ కమ్యూనికేషన్ పేరుతో గుబ్బి, కుణిగల్ తాలూకాలలో సిమ్ కార్డులు, మొబైల్ కరెన్సీ విక్రయిస్తున్నాడు. గత నాలుగేళ్లుగా రూ 14 లక్షలు చెల్లించని బీఎస్ఎన్ఎల్ కార్యాలయ అధికారులు నాగరాజ్ ను ఇబ్బందులకు గురి చేశారని తెలిసింది. అయితే తీసుకున్న రుణం చెల్లించడానికి నాగరాజ్ రూ. 16 లక్షల వరకు. అప్పుల పాలైనాడని తెలిసింది.
ఇదే విషయంలో నాగరాజ్, నాగరత్న దంపతులు అేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బీఎస్ఎన్ఎల్ అధికారులు డబ్బులు చెల్లించకపోవడంతో నాగరాజ్ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాడని తెలిసింది. దీనికితోడు రుణదాతలు తీసుకున్న రుణం చెల్లించాలని వేధించడంతో నాగరాజ్, నాగరత్న దంపతులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఏం చెయ్యాలో తెలీక నాగరాజ్, నాగరత్న దంపతులు సతమతం అయ్యారు.

నాగరాజ్, నాగరత్న దంపతులు బీఎస్ఎన్ఎల్ ఆఫీసుకు వెళ్లారు. అప్పుడు కూడా డబ్బులు ఇవ్వకుండా అధికారులు మానసికంగా హింసించారని తెలిసింది. దీంతో విసిగి వేసారిన నాగరత్న, నాగరాజ్ దంపతులు సాయంత్రం బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ముందే మీద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు.
బీఎస్ఎన్ఎల్ కార్యాలయ అధికారులపై నాగరాజ్, నాగరత్న దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై తుమకూరు టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నాగరాజ్ కు డబ్బులు చెల్లించని అధికారుల మీద బీఎస్ఎన్ఎల్ సీనియర్ అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications