నటి లైంగిక దాడి కేసు: హీరో దిలీప్, కావ్య మాధవన్ కు నో బెయిల్: ఇద్దరికి ఒకే రోజు ఎదురుదెబ్బ !

నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన మలయాళం సూపర్ స్టార్ దిలీప్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాలుగో సారి దిలీప్ పెట్టుకుని బెయిల్ పిటిషన్ ను సోమవారం అంగమాలి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు

కొచ్చి: నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన మలయాళం సూపర్ స్టార్ దిలీప్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాలుగో సారి దిలీప్ పెట్టుకుని బెయిల్ పిటిషన్ ను సోమవారం అంగమాలి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు కొట్టి వెయ్యడంతో ఆయన అలువా సబ్ జైలుకే పరిమితం అయ్యాడు.

ఇప్పటికే రెండు సార్లు కేరళ హైకోర్టులో, రెండు సార్లు అంగమాలి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ ఇవ్వాలని దిలీప్ అర్జీ సమర్పించారు. నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో దిలీప్ కు సంబంధం ఉందని ఆధారాలు సేకరించిన పోలీసులు కోర్టులో సమర్పించారు.

A court in Angamaly rejected the bail plea of Malayalam actor Dileep

దిలీప్ కు వ్యతిరేకంగా ఉన్న సాక్షాలు పరిశీలించిన న్యాయస్థానం ఆయనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. సెప్టెంబర్ 28వ తేదీ వరకు దిలీప్ కు జ్యూడీషిల్ రిమాండ్ విదిస్తూ శనివారం అంగమాలి కోర్టు తీర్పు చెప్పింది. దిలీప్ కు బెయిల్ ఇవ్వరాదని కేరళ పోలీసులు కోర్టులో అభ్యంతంరం వ్యక్తం చేస్తున్నారు.

దిలీప్ భార్య, నటి కావ్య మాధవన్ ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణ సోమవారం కేరళ హైకోర్టులో జరిగింది. కావ్య మాధవన్ పెట్టుకున్న బెయిల్ పిటీషన్ పరిశీలించిన కేరళ హైకోర్టు వచ్చే వారానికి విచారణ వాయిదా వేసింది. మొత్తం మీద దిలీప్, ఆయన భార్య కావ్య మాధవన్ కు సోమవారం వేర్వేరు కోర్టులలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+