Puneeth Rajkumar: ప్రధాని మోడీని కదిలించిన మరణవార్త: ఆ ఫొటో ట్వీట్..సంతాపం

న్యూఢిల్లీ: శాండల్‌వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్.. మరణవార్త ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కదిలించింది. పునీత్ హఠాన్మరణం పట్ల మోడీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సంతాపాన్ని తెలిపారు. ప్రధానమంత్రితో పాటు పలువురు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, రాష్ట్రమంత్రులు, సినీ ప్రముఖులు స్పందించారు. 46 సంవత్సరాల వయస్సులో- కేరీర్ అత్యున్నత స్థితిలో ఉన్న సమయంలో గుండెపోటుతో మరణించడం అనేక మందిని దిగ్భ్రాంతికి గురి చేసింది.

దూరం చేసిన విధి..

పునీత్ రాజ్‌కుమార్ మరణం పట్ల ప్రధాని తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఓ అత్యుత్తమ నటుడిని, చిన్న వయస్సులోనే విధి తమ నుంచి లాక్కుందని ఆవేదన వ్యక్తం చేశారు. విధి ముందు అన్ని వయస్కుల వార సమానమేని చెప్పారు. చిన్న, పెద్ద అనే తేడా ఉండదని అన్నారు. పునీత్ రాజ్‌కుమార్‌‌ను భవిష్యత్ తరాలు చిరకాలం పాటు గుర్తు పెట్టుకుంటాయని మోడీ అన్నారు. ఆయనను స్మరించుకుంటామని చెప్పారు. అద్భుతమైన వ్యక్తిత్వం గల నటుడని వ్యాఖ్యానించారు. పునీత్ కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలిపారు.

బ్రైట్ స్టార్..

పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం పట్ల కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ సంతాపం తెలిపారు. ఆయన సినీ వినీలాకాశంతో ధృవతారలా నిలిచిపోతారని చెప్పారు. సుదీర్ఘమైన కేరీర్‌‌.. ఉచ్ఛస్థితిలో ఉన్న సమయంలో పునీత్ కన్నుమూయడం తనను కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పునీత్ కుటుంబ సభ్యులు, లక్షలాదిమంది అభిమానులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని నిర్మల సీతారామన్ వ్యాఖ్యానించారు. నిర్మల సీతారామన్.. కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపికైన విషయం తెలిసిందే.

వ్యక్తిగతంగా తీవ్ర నష్టం..


పునీత్ రాజ్‌కుమార్ మృతిపట్ల కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తాను ఎంతగానో అభిమానించే, ఇష్టపడే సూపర్ స్టార్ పునీత్.. ఇక లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నానని చెప్పారు. అతి తక్కువ కాలంలోనే ఆయన తమను విడిచి వెళ్లారని అన్నారు. పునీత్ హఠాన్మరణం.. తనకు వ్యక్తిగతంగా తీరని లోటు అని బసవరాజ్ బొమ్మై వ్యాఖ్యానించారు. ఆయన లేని లోటు ఎలాంటిదో మాటల్లో వర్ణించలేనని వ్యాఖ్యానించారు. రాజ్‌కుమార్ కుటుంబానికి మనోస్థైర్యాన్ని, ఆత్మబలాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, హెచ్‌డీ కుమార స్వామి పునీత్ మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తమ సంతాపాన్ని తెలిపారు.

దశాబ్దాలుగా రాజ్‌కుమార్ కుటుంబంతో అనుబంధం..

పునీత్ మరణం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంతాపం వ్యక్తం చేశారు. రాజ్‌కుమార్ కుటుంబంతో తనకు దశాబ్దాల నుంచీ అనుబంధం ఉందని అన్నారు. ఓ స్టార్‌డమ్ ఉన్న హీరోగా మాత్రమే కాకుండా.. ఓ గొప్ప మానవతావాదిగా పునీత్ రాజ్‌కుమార్ చిరకాలం పాటు గుర్తుండిపోతారని చెప్పారు. తన తండ్రి కరుణానిధి కన్నుమూసిన సమయంలో పునీత్ రాజ్‌కుమార్ ఇంటికి వచ్చి.. తనను ఓదార్చారని గుర్తు చేశారు. కన్నడ చలన చిత్ర పరిశ్రమ ఓ స్టార్‌ను, సమకాలీన చలన చిత్ర పరిశ్రమలో తిరుగులేని నటుడిని కోల్పోయిందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+