Rs.2000: రెండు వేల నోటు వద్దన్న పెట్రోల్ బంక్.. కేసు పెట్టిన వినియోగదారుడు..

ఆర్బీఐ రూ.2000 నోట్లు ఉపసంహరించుకుంటున్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. ప్రజల వద్ద ఉన్న రూ.2000 నోట్లు బ్యాంకుల్లో ఇచ్చి ఇతర కరెన్సీ నోట్లు తీసుకోవాలని సూచించింది. అందుకు సెప్టెంబర్ 30, 2023 గడువు విధించింది. అలోగా నోట్లు మార్చుకోవాలని స్పష్టం చేసింది. దీంతో చాలా మంది తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లతో షాపులు, వైన్స్, హోటళ్లకు వెళ్తున్నారు. ముఖ్యంగా పెట్రోల్ బంకులకు భారీగా రూ.2000 నోట్లు వస్తున్నాయి. అయితే కొన్ని పెట్రోల్ బంకులు రూ.2000 స్వీకరిస్తూ.. కనీసం రూ.500 పెట్రోలు పోయించుకుంటేనే రూ.2000 తీసుకుంటున్నాయు.

కొన్ని పెట్రోలు బంక్ లు రూ.2000 నోటు తీసుకోవడం లేదు. దీంతో సదరు పెట్రోల్ బంక్ పై వినియోగదారుడు కేసు పెట్టాడు. ఢిల్లీలోని సౌత్ ఎక్స్‌టెన్షన్ పార్ట్-1లోని పెట్రోల్
బంక్ లో ఓ వ్యక్తి పెట్రో కొట్టించుకోవడానికి వెళ్లాడు. అయితే అతను రూ.2000 నోటు ఇచ్చాడు. దీన్ని పెట్రోల్ బంక్ వారు తీసుకోలేదు. తన వద్ద చిల్లర లేదంటూ వాదించాడు. అయినా రూ.2000 నోటు తీసుకోలేదు. దీంతో వినియోగదారుడు సదుర్ పెట్రోల్ బంక్ ఉద్యోగిపై కోట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

 refused to accept a Rs.2000 note in Delhi

వినియోదారుడి ఫిర్యాదు స్వీకరించినట్లు పోలీసులు శనివారం తెలిపారు. పెట్రోల్ బంక్ కు స్కూటర్‌లో పెట్రోల్ నింపుకునేందుకు వెళ్లినట్లు ఫిర్యాదుదారు పేర్కొన్నాడు. రూ.400 బిల్లుకు రూ.2000 నోటు ఇచ్చాడని, అయితే పెట్రోల్ పంప్ అటెండర్ నోటు తీసుకోవడానికి నిరాకరించాడని అధికారి తెలిపారు. చాలా చోట్లు పెట్రోల్ బంక్ ల వారు రూ.2000 నోట్లు తీసుకోవడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటు బ్యాంకుల్లో కూడా ప్రజలు రూ.2000 నోట్లును ఎక్సేంజ్ చేసుకుంటున్నారు.

ఒక వ్యక్తి బ్యాంక్ లో రోజు రూ.20 వేల విలువ గల రూ.2000 నోట్లను మార్చుకోవచ్చు. రూ.2000 మార్చుకోవచ్చు లేదా ఖాతాలో కూడా జమ చేసుకోవచ్చు. రూ.2000 నోట్లు ఉపసంహరణతో ఇప్పుడు రూ.500 పెద్ద నోటుగా ఉండబోతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+