గుడిలో హనుమాన్ సాలిచా పారయణ చేస్తూ హుండిలో డబ్బులు లూటీ చేసిన భక్తుడు !
హర్యానా: ఓ దొంగ ఆలయంలో హుండీలో ని నగదు దొంగిలించి అందులో రూ. 10 రూపాయలు మళ్లీ హుండిలో వేసి మొత్తం డబ్బు దోచుకెళ్లాడు. అంతేకాదు గుడిలో హనుమాన్ చాలీసా పఠించడమే కాకుండా చోరీకి పాల్పడి హుండీలో ఉన్న డబ్బును దోచుకున్నందుకు నన్ను క్షమించు దేవుడా అని ఆ దొంగ వేడుకున్నాడు. ఈ దృశ్యాలన్నీ ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
ఘటనపై కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు దొంగ కోసం వేట మొదలుపెట్టాడు. విచిత్రమైన ఘటనలో దొంగ మొదట దేవుడిని ప్రార్థించాడు. ఆపై దొంగతనానికి పాల్పడ్డాడు. హర్యానాలోని రేవారిలో ప్రాంతంలో శ్రీ ఆంజనేయ ఆలయం ఉంది. ఇదే ఆలయంలో హనుమాన్ చలిసా పారాయణం చేస్తూ దొంగతనానికి పాల్పడ్డాడని పోలీసులు అన్నారు.

హనుమంతుడి విగ్రహం ముందు కూర్చున్న ఒక భక్తుడు ఇతర భక్తులు ఉండగానే నేలపై కూర్చున్నాడు. హనుమాన్ చాలీసాను జపిస్తూ నెమ్మదిగా హుండీ తలుపు తీసి, తన చేతిలో డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు చేతితో ఎత్తుకుని అతని చొక్కాలోకి నింపుకున్నాడు. హుండీలో రూ. 5 వేలు డబ్బులు ఉండగా ఈ దొంగ రూ. 10 రూపాయలు మళ్లీ దేవుడి కోసం హుండిలో వేసి మిగిలిన డబ్బు లూటీ చేశాడు.
అయితే ఈ విషయం తెలియక ఆలయ పూజారి గుడి తలుపు వేసుకుని వెళ్లిపోయాడు. అయితే మరుసటి రోజు తిరిగి వచ్చి చూసే సరికి గుడిలోని హుండి తలుపులు పగలగొట్టి ఉండడం గమనించాడు. ఈ నేపథ్యంలో పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి సీసీటీవీని పరిశీలించి షాక్‌కు గురయ్యారు. ఎందుకంటే చోరీకి ముందు ఆ దొంగ దేవుడి ముందు కూర్చుని హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ దేవుడి పాదాల చెంత ఉన్నట్లు నటిస్తూ హుండీలో డబ్బు కొట్టేశాడని పోలీసులు అన్నారు.












Click it and Unblock the Notifications