30 వేల అడుగుల ఎత్తులో పాపకు జన్మ (వీడియో)

అలస్కా: విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళకు ఆకస్మికంగా పురిటి నొప్పులు రావడంతో భూమికి 30,000 అడుగుల ఎత్తులో పురుడు పోశారు. విమాన సిబ్బంది తల్లి, బిడ్డను క్షేమంగా రక్షించి ఆసుపత్రికి తరలించారు. చైనా ఎయిర్ లైన్స్ లో ఈ అద్బుతం జరిగింది.

చైనా ఎయిర్ లైన్స్ విమానం బాలీ నగరం నుంచి లాస్ ఏంజెల్స్ కు బయలుదేరింది. ఈ విమానంలో తైవాన్ కు చెందిన మహిళ ఉంది. ఈమె 8 వారాల తరువాత ప్రసవం అవుతుందని వైద్యులు చెప్పారు. అయితే విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి.

విషయం గుర్తించిన విమాన సిబ్బంది అదే విమానంలో ఉన్న వైద్యులకు సమాచారం అందించారు. విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చెయ్యాలని నిర్ణయించారు. అయితే ఆమెకు పురిటి నోప్పులు మరింత ఎక్కువ కావడంతో వైద్యులు ప్రసవం చెయ్యాలని నిర్ణయించారు.

A doctor was on board the aircraft and was able to assist in the baby's delivery.

వెంటనే వైద్యులకు విమాన సిబ్బంది సహకరించారు. మహిళకు క్షేమంగా డెలివరి చేశారు. విమానంలోని దప్పట్లలో బిడ్డను ఆనందంగా అందుకున్నారు. టిష్యూ పేపర్స్ తో తల్లి, బిడ్డను శుభ్రం చేశారు. అదే విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడు ఈ డెలివరి దృశ్యాలను మొబైల్ లో రికార్డు చేశాడు.

30 వేల అడుగుల ఎత్తులో ఆ తల్లి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అలస్కాలోని టెడ్ స్టీవెన్స్ ఆంకరేజ్ విమానాశ్రయంలో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేసి తల్లి, బిడ్డను ఆసుపత్రికి తరిలించారు. మూడు గంటల ఆలస్యంగా విమానం లాస్ ఏంజిల్స్ బయలుదేరి వెళ్లింది. తల్లి, బిడ్డను క్షేమంగా కాపాడినందుకు విమాన సిబ్బంది ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+