Dog: యజమానిని కాపాడేందుకు 4 గంటలు శ్రమించిన కుక్క.. కానీ..

కుక్కలు ఎంత విశ్వాసంగా ఉంటాయో మరోసారి నురూపితమైంది. ఓ కుక్క తన యజమాని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటే అతన్ని దింపాలని 4 గంటల పాటు శ్రమించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఝాన్సీలో పంచవటిలోని పోష్ కాలనీలో యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతున్న యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని తండ్రి అనారోగ్యంతో ఉన్న తల్లితో కలిసి భోపాల్ వెళ్లాడు. ఇంతలో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఔట్‌పోస్టు ఇన్‌చార్జి ఇంట్లోకి వెళ్గా.. అక్కడ ఉన్న పెంపుడు కుక్క తీవ్రంగా కరిచింది.

దీంతో కుక్కకు మత్తు మంది ఇచ్చి పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయగలిగారు. ఆనంద్‌ అగ్నిహోత్రి అనే రైల్వేలో బడ్జెట్ సెక్షన్ ఆఫీసర్ గా పని చేస్తున్నాడు. అతనికి భార్య, కుమారుడు సంభవ్ (25) ఉన్నారు. సంభవ్ యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. సంభవ్ తల్లి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెను చికిత్స నిమిత్తం ఆనంద్‌ భోపాల్‌కు తీసుకెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సంభవ్ కు శనివారం రాత్రి పది గంటల సమయంలో తండ్రి ఆనంద్ ఫోన్ చేశాడు. కానీ సంభవ్ ఫోన్‌ ఎత్తలేదు.

A dog worked for 4 hours to save his owner

దీంతో ఆనంద్ పక్కింటి వారికి ఫోన్ చేశాడు. వారు వచ్చి చాలా సేపు బెల్ కొట్టినా సంభవ్ బయటకు రాలేదు. వారి పెంపుడు కుక్క అలెక్స్ అరుపులు మాత్రమే వినిపించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటాయనే భయంతో తండ్రి పోలీసులకు సమాచారం అందించాడు. కొద్దిసేపటికి ఉన్నావ్ గేట్ ఔట్ పోస్ట్ ఇంచార్జి శివమ్ సింగ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అతను లోపలికి వెళ్లబోతుండగా కుక్క అలెక్స్ అతన్ని కరిచింది. అలెక్స్ ఎవరినీ లోపలికి రానియలేదు. పోలీసులు మున్సిపల్ కార్పొరేషన్ బృందాన్ని పిలిచారు.

మున్సిపల్ కార్పొరేషన్ బృందం పెంపుడు కుక్కకు మత్తు మందు ఇచ్చారు. అనంతరం పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి చేరుకున్నారు. సంభవ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. సంభవ్ డిప్రెషన్‌లో ఉన్నట్లు బంధువులు తెలిపారు. పరీక్షలో విజయం సాధించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని బంధువులు చెబుతున్నారు. సంభవ్ షెపర్డ్ డాగ్ అలెక్స్‌ను ఎంతో ప్రేమతో పెంచారు. సంభవ్ మరణించిన కొద్దిసేపటికే అలెక్స్ కూడా చనిపోయింది. మత్తు మందు ఎక్కువ అవడం వల్ల కుక్క చనిపోయందని తెలుస్తోంది.

సంభవ్ అత్మహత్య చేసుకుంటునప్పుడు అలెక్స్ అక్కడే ఉంది. సంభవ్ ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించింది. సంభవ్ బట్టలు, కాళ్ల పై కుక్క కాలి గీతలు కనిపించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+