ఏటీఎం: సినిమా ఫక్కీలో రూ. 66 లక్షలతో డ్రైవర్ ఎస్కేప్

బెంగళూరు: ఏటీఎం కేంద్రాలలో నగదు నిల్వ చెయ్యడానికి వెళ్లిన సమయంలో మల్టి యుటిలిటి వెహికల్(ఎంయువీ) వాహనంలో ఉన్న రూ. 66 లక్షలతో పాటు డ్రైవర్ సినిమా ఫక్కీలో పరారైన సంఘటన బెంగళూరులో జరిగింది. కేరళకు చెందిన జేమ్స్ అనే నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ అధికారులు బెంగళూరు నగరంలోని వారి శాఖల ఏటీఎం కేంద్రాలలో నగదు నిల్వ చెయ్యడానికి బ్రింక్స్ ఆర్య ఇండియా ప్రయివేటు లిమిటెడ్ అనే సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ సంస్థ ఉద్యోగులు ప్రతి రోజు వాహనాలలో నగదు తీసుకు వెళ్లి ఏటీఎం కేంద్రాలలో నిల్వ చేస్తారు.

ఎప్పటిలాగే మంగళవారం రూ. ఒక కోటి తీసుకుని వాహనంలో ఏటీఎం కేంద్రాల దగ్గరకు బయలుదేరారు. ఆ వాహనం డ్రైవర్ జేమ్స్. వాహనంలో నలుగురు సిబ్బంది, సెక్యూరిటి గార్డు తిమ్మయ్య ఉన్నారు. ఆర్ టీ నగర్, రిచ్ మెండ్ రోడ్డు లోని ఏటీఎం కేంద్రాలలో నగదు నిల్వ చేశారు.

A driver of the van fled away with around Rs. 66 lakh.

తరువాత మధ్యాహ్నం 3 గంటల సమయంలో అవెన్యూ రోడ్డు చేరుకున్నారు. రూ. 15 లక్షలు తీసుకున్న సిబ్బంది ఏటీఎం కేంద్రం దగ్గరకు బయలుదేరారు. సెక్యూరిటి గార్డు తిమ్మయ్య అతని దగ్గర ఉన్న డబుల్ బ్యారెల్ గన్ వాహనంలో పెట్టి ఏటీఎం కేంద్రం దగ్గరకు వెళ్లాడు.

అంతే డ్రైవర్ సీటులో ఉన్న జేమ్స్ ఒక్క సారిగా ఇంజన్ స్టాట్ చేసి సినిమా ఫక్కిలో అక్కడి నుండి పరారైనాడు. ఒక్క సారి షాక్ కు గురైన సెక్యూరిటి గార్డు తిమ్మయ్య గట్టిగా కేకలు వేసినా ఫలితం లేకపోయింది. వెంటనే తిమ్మయ్య తన పైఅధికారులకు సమాచారం ఇచ్చారు.

విషయం తెలుసుకున్న పోలీసులు నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అన్ని వాహనాలు సోదాలు చేసినా జేమ్స్ ఆచూకి మాత్రం చిక్కలేదు. బ్రింక్స్ ఇండియా సంస్థ అధికారుల దగ్గర నిందితుడు జేమ్స్ కు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని పోలీసులు అంటున్నారు.

అతను మంగళవారం ఉద్యోగానికి వచ్చాడని, కేరళకు చెందిన వాడని మాత్రం తెలుసు అని సంస్థ నిర్వహకులు పోలీసులకు చెప్పారు. ఆ సంస్థకు జేమ్స్ ను ఎవరు పరిచయం చేశారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రూ. 66 లక్షలు లూటీ చెయ్యడానికి జేమ్స్ ఎవరైనా సహకరించారా అని ఆరా తీస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+