రియల్ హీరో: వింగ్ కమాండర్ అభినందన్ పేరుతో నకిలి అకౌంట్, హల్ చల్, కేంద్ర ప్రభుత్వం!
న్యూఢిల్లీ: పాకిస్తాన్ కు పట్టుబడి చివరికి విడుదలైన ఇండియన్ ఎయిర్స్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్దమాన్ పేరుతో నకిలి ట్వీట్టర్ అకౌంట్ ప్రారంభించిన కొందరు అల్లరిమూకలు చలగాటం ఆడుతున్నారని వెలుగు చూసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ ట్విట్టర్ అకౌంట్ నకిలిది అంటూ అధికారులు గుర్తించారు.
తమ ఆధీనంలో ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను శుక్రవారం రాత్రి 9.15 గంటల సమయంలో పాకిస్తాన్ అధికారులు వాఘా సరిహద్దులో భారత్ ఎయిర్ ఫోర్స్ అధికారులకు అప్పగించిన విషయం తెలిసిందే.
అనంతరం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ పేరుతో నకిలి ట్వీట్టర్ అకౌంట్ ప్రారంభించి ఇంగ్లీష్, తమిళంలో పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. విషయం గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వెంటనే ట్వీట్ లను తొలగించి ఇది అభినందన్ అధికారిక ట్వీట్టర్ కాదని స్పష్టం చేసింది.

కేంద్ర రక్షణ శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ఢిల్లీలోని ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న వింగ్ కమాండర్ అభినందన్ తో చర్చించారు. అభినందన్ ఆరోగ్యం గురించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆరా తీశారు. దాదాపు గంట సేపు అభినందన్ తో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చర్చించారని సమాచారం.
అభినందన్ నకిలి అకౌంట్ లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, అభినందన్ ఫోటోలు దర్శనం ఇచ్చాయి. తనను ఎంతో గౌరవించి, నా ఆరోగ్యం గురించి వివరాలు తెలుసుకొవడానికి ఆసుపత్రికి వచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు అంటూ నకిలి ట్వీట్టర్ అకౌంట్ లో పోస్టు చేశారు. అంతే కాకుండా ఇదే తన ఫ్యామిలి అంటూ అభినందన్ ఉన్న ఫోటోలను నకిలి ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications