పోలీసుల వలలో నకిలి ఎస్ఐ, మీ కొడుకు అమ్మాయిలను మోసం చేశాడని హల్ చల్, లంచం!

బెంగళూరు: పోలీసులు దుస్తులు వేసుకుని అందర్నీ మోసం చేస్తున్న నిందితుడిని కర్ణాటకలోని మైసూరు పోలీసులు పట్టుకున్నారు. బెంగళూరులో నివాసం ఉంటున్నన సిద్దప్ప చెన్నబసప్ప (28) అనే యువకుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

సిద్దప్ప ఎస్ఐ వేసుకునే పోలీసు యూనీఫాం వేసుకుని తాను ఇంటలిజెన్న్ అధికారి అంటూ అందర్నీ బెదిరిస్తున్నాడు. ఇతను మైసూరు నగరంలోని పలు పోలీస్ స్టేషన్లకు భేటీ అయ్యి అక్కడి సిబ్బందిని బెదిరించాడని తెలిసింది.

A fake police officer was arrested by Udayagiri police in Mysuru in Karnataka.

మైసూరులోని శక్తినగర్ లో నివాసం ఉంటున్న నారాయణగౌడ ఇంటికి కారులో వెళ్లిన సిద్దప్ప మీ కుమారుడు రేణుకేష్ చాల మంది అమ్మాయిలను మోసం చేశాడని, కేసులు నమోదు కాకుండా ఉండాలంటే రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

నారాయణగౌడకు అనుమానం వచ్చి రూ. 5 వేలు సిద్దప్ప చేతిలో పెట్టి మిగిలిన డబ్బులు ఏటీఎంటో డ్రా చేసుకుని వస్తానని, మీరు ఇక్కడే ఉండాలని చెప్పి నేరుగా ఉదయగిరి పోలీస్ స్టేషన్ చేరుకుని ఫిర్యాదు చేశారు. ఉదయగిరి పోలీసులు వెళ్లి సిద్దప్పను విచారణ చేశారు.

బెంగళూరులోని ఇంటలిజెన్స్ కార్యాలయానికి ఫోన్ చేసి వివరాలు సేకరించగా సిద్దప్ప నకిలి అధికారి అని వెలుగు చూడటంతో అరెస్టు చేశారు. సిద్దప్ప ఇలా ఎంత మందిని మోసం చేశాడు అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+