బెంగళూరులో పిల్లల దొంగలు, పుకార్లు, నడిరోడ్డులో యువకుడిని కొట్టి చంపేశారు, వైరల్!

బెంగళూరు: చిన్నపిల్లలను ఎత్తుకెళ్లే దొంగలు ఎక్కువ అయ్యారని కర్ణాటకలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే సందర్బంలో బెంగళూరు నగరంలోని చామరాజపేటలోని బుధవారం కాలు రామ్ (25) అనే యువకుడు పిల్లలను ఎత్తుకెళ్లడానికి వచ్చాడని అనుమానించి నడిరోడ్డులో ఇష్టం వచ్చినట్లు స్థానికులు దాడి చెయ్యడంతో అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. శ్రీరాంపురలో మరో మహిళ మీద ఇలాగే దాడి చెయ్యడంతో ఆమెకు తీవ్రగాయాలైనాయి.

 అమాయకుడు బలి

అమాయకుడు బలి

రాజస్థాన్ కు చెందిన కాలు రామ్ (25) అనే యువకుడు బుధవారం చామరాజపేటలో వెలుతున్నాడు. ఆ సమయంలో కాలు రామ్ చిన్నపిల్లలను ఎత్తుకెళ్లడానికి వచ్చాడని అనుమానంతో స్థానికులు అతన్ని పట్టుకున్నారు. తరువాత స్థానికులు కాలు రామ్ మీద దాడి చేశారు.

 క్రికెట్ బ్యాట్ లు, రాళ్లతో దాడి

క్రికెట్ బ్యాట్ లు, రాళ్లతో దాడి

బెంగళూరులోని చామరాజపేటలో కాలు రామ్ ను వీదుల్లో వెంటాడి వెంటాడి దాడి చేశారు. క్రికెట్ బ్యాట్లు, రాళ్లుతో దాడి చేశారు. కాలు రామ్ కాళ్లకు తాడు కట్టి రోడ్డు మీద ఈడ్చుకెళ్లారు. కాలు రామ్ మీద దాడి చేస్తున్న సమయంలో స్థానికులు మొబైల్ లో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యాయి.

అమాయకుడు బలి

అమాయకుడు బలి

స్థానికుల దాడిలో కాలు రామ్ సృహ తప్పిపోయాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో చామరాజపేట పోలీసులు కాలు రామ్ ను విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. స్థానికుల దాడిలో తీవ్రగాయాలైన కాలు రామ్ చికిత్స విఫలమై మరణించాడని గురువారం డీసీసీ రవి చెన్నణ్ణవర్ చెప్పారు.

మహిళపై దాడి

మహిళపై దాడి

బెంగళూరు నగరంలోని మెజస్టిక్ సమీపంలోని శ్రీరాంపురలో బుధవారం రాత్రి ఓ మహిళ మీద స్థానికులు దాడి చేశారు. చిన్నపిల్లలను ఎత్తుకెళ్లడానికి వచ్చిందని తీవ్రస్థాయిలో మహిళ మీద స్థానికులు దాడి చేశారు. చివరికి పోలీసుల విచారణలో ఆమెకు మతిస్థిమితం లేదని వెలుగు చూసింది. తీవ్రగాయాలైన మహిళను పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

డీసీపీ రవి వార్నింగ్

డీసీపీ రవి వార్నింగ్

బెంగళూరు నగరంలో చిన్నపిల్లలను ఎత్తుకెళ్లే గ్యాంగులు ఏవీ లేవని డీసీపీ రవి. డి చెన్నణ్ణనవర్ మీడియాకు చెప్పారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ రవి హెచ్చరించారు. చామరాజపేటలో యువకుడి మీద దాడి చేసి చంపేసిన ఘటనలో 20 మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని డీసీపీ రవి మీడియాతో అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+