ఐఏఎస్ టార్గెట్, ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న లేడీ బ్యాంక్ మేనేజర్ !

బెంగళూరు/మండ్య: ఓ యువతి కాలేజ్ చదువు పూర్తి చేసింది. కష్టపడి చదివిన ఆ యువతి ఐఏఎస్ అధికారి కావాలని ఆశపడింది. ఇదే సమయంలో పోటీ పరీక్షలు రాస్తున్న ఆ యువతికి బ్యాంక్ మేనేజర్ గా ఉద్యోగం వచ్చింది. అతి చిన్న వయసులోనే బ్యాంక్ మేనేజర్ గా ఉద్యోగం సంపాధించి మంచి జీతం తీసుకుంది. అయితే బ్యాంక్ మహిళా మేనేజర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

కర్ణాటకలోని చామరాజనగర జిల్లాలోని కోళ్లేగాల పట్టణంలో మల్లప్ప అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. మల్లప్పకు శృతి (30) అనే కుమార్తె ఉంది. కాలేజ్ చదువు పూర్తి చేసిన శృతి ఐఏఎస్ అధికారి కావాలని ఆశపడింది. ఇదే సమయంలో కర్ణాటకలో శృతి పోటీ పరీక్షలు రాయడం మొదలుపెట్టింది. శృతికి 23 ఏళ్ల వయసు ఉన్న సమయంలో మంచి ఉద్యోగం వచ్చింది.

 suicide

కావేరి గ్రామీణ బ్యాంకు మేనేజర్ గా శృతికి మంచి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన వెంటనే చిక్కమగళూరు బ్రాంచ్ మేనేజర్ గా శృతి బాధ్యతలు స్వీకరించింది. గత 7 సంవత్సరాల నుంచి చిక్కమగళూరులోనే శృతి ఉద్యోగం చేసింది. అయితే సొంత ఊరికి దగ్గరగా ఉంటుందని శృతి మండ్యకు రెండు నెలల క్రితమే బదిలిపై వచ్చింది.

మండ్యలో వినాయక లేఔట్ లో రాజన్న అనే వ్యక్తి ఇంటిని అద్దెకు తీసుకున్న శృతి ప్రతిరోజు మండ్యలోని కావేరి గ్రామీణ బ్యాంక్ లో ఉద్యోగం చేసి తరువాత ఇంటికి వస్తున్నది. శృతికి ఇంకా పెళ్లి కాకపోవడంతో మండ్యలో అద్దె ఇంటిలో ఒంటరిగా నివాసం ఉంటున్నది. సోమవారం ఉద్యోగానికి వెళ్లిన శృతి సాయంత్రం ఇంటికి చేరుకుంది.

bank manager

తరువాత రాత్రి తండ్రి మల్లన్నకు ఫోన్ చేసిన శృతి అప్ప తాను దేవుడి దగ్గరకు వెళ్లిపోతున్నాను, నన్ను క్షమించు అంటూ చెప్పి ఫోన్ కట్ చేసింది. ఆందోళన చెందిన మల్లప్ప వెంటనే కూతురు శృతికి ఫోన్ చేశాడు. అయితే అప్పటికే శృతి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో మల్లప్ప మండ్యలోని బంధువులకు ఫోన్ చేసి మ్యాటర్ చెప్పాడు.

బంధువులు శృతి ఇంటికి వెళ్లి చూడగా అప్పటికే ఆమె ఉరి వేసుకుంది. శృతిని కిందకు దించి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు చెప్పారు. ఐఏఎస్ అధికారి కావాలని తాను ఆశపడ్డానని, పోటీ పరీక్షల్లో తాను ఐఏఎస్ పాస్ కాలేకపోయానని, తాను జీవితంలో ఓడిపోయానని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని డెత్ నోట్ రాసిన శృతి ఆత్మహత్య చేసుకుందని, కేసు విచారణలో ఉందని మండ్య పోలీసు అధికారులు తెలిపారు. ఐఏఎస్ పాస్ కాలేదని బ్యాంక్ మహిళా మేనేజర్ ఆత్మహత్య చేసుకోవడం మండ్యలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+