అన్న అప్పు చేశాడని టెక్కీ చెల్లి మీద అత్యాచారం, కిడ్నాప్, దాడి, వడ్డీ వ్యాపారి వీరంగం !

బెంగళూరు: అన్న అప్పు చేశాడని, తీసుకున్న రుణం చెల్లించలేదని విద్యావంతురాలైన చెల్లెలు మీద వడ్డీ వ్యాపారి అత్యాచారం చేసిన ఘటన బెంగళూరు నగరంలో సంచలనం కలిగించింది. దాదాపు రెండు సంవత్సరాల నుంచి లైంగిక వేదింపులకు గురౌతున్న మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. హల్ చల్ చేసిన వడ్డీ వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు.

జార్ఖండ్ కు చెందిన తారకనాథ్ భార్యతో కలిసి బెంగళూరు చేరుకుని హుళిమావు సమీపంలో నివాసం ఉంటున్నాడు. తారకనాథ్ సోదరి అత్యున్నత విద్యాభ్యాసం పూర్తి చేసి రెండు సంవత్సరాల క్రితం ఉద్యోగం కోసం బెంగళూరు చేరుకుని అన్న తారకనాథ, వదినతో కలిసి నివాసం ఉంటున్నది.

A financier sexually assault techie after her brother fails repay loan in Bengaluru

రెండు సంవత్సరాల క్రితం తారకనాథ్ షేర్ మార్కెట్ వ్యాపారం మొదలు పెట్టాడు. చేతిలో ఉన్న డబ్బు మొత్తం షేర్ మార్కెట్ లో పెట్టి దివాలా తీశాడు. హుళిమావు సమీపంలో నివాసం ఉంటున్న వడ్డి వ్యాపారి బాలాజీ దగ్గర తారకనాథ్ రూ. 6 లక్షలు రుణం తీసుకుని షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాడు.

అయితే తరకనాథ్ పెట్టిన షేర్లు అన్ని దివాలా తీశాయి. వడ్డి వ్యాపారి బాలాజీ తీసుకున్న రుణం చెల్లించాలని తారకనాథ్ మీద ఒత్తిడి చేశాడు. ఇదే సమయంలో తారకనాథ్ సోదరికి ప్రసిద్ది చెందిన కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం వచ్చింది.

రుణం వసూలు చెయ్యడానికి తారకనాథ్ ఇంటికి వెలుతున్న వడ్డి వ్యాపారి బాలాజీ అతని సోదరి మీద కన్ను వేశాడు. రుణం చెల్లించాలని ఒత్తిడి చేస్తూ తారకనాథ్ సోదరి మీద లైంగిక వేదింపులకు పాల్పడ్డాడు. సోదరుడు రుణం తీర్చలేకపోతున్నాడని ఓపికగా తారకనాథ్ సోదరి వడ్డి వ్యాపారి బాలాజీ లైంగిక వేదింపులు తట్టుకుని మౌనంగా ఉండిపోయింది.

అయితే రానురాను వడ్డి వ్యాపారి బాలాజీ లైంగిక వేదింపులు యువతి మీద ఎక్కువ అయ్యాయి. దాదాపు రెండు సంవత్సరాల నుంచి సోదరుడు తారకనాథ్ కోసం యువతి లైంగిక వేదింపులకు గురౌయ్యింది. ఇటీవల వడ్డి వ్యాపారి బాలాజీ రెచ్చిపోయాడు.

తారకనాథ్ కిడ్నాప్ చేసి రహస్య ప్రాంతంలోని గదిలో నిర్బంధించి ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు. వెంటనే తీసుకున్న రుణం వడ్డీతో సహ చెల్లించాలని, లేదంటే 12 నెలల కుమార్తెను కిడ్నాప్ చేస్తానని తారకనాథ్ ను వడ్డీ వ్యాపారి బాలాజీ బెదిరించాడు.

తనకు కొంత సమయం ఇస్తే తన సోదుడు తారకనాథ్ తీసుకున్న రుణం వడ్డితో సహ చెల్లిస్తానని యువతి బాలాజీకి మనవి చేసింది. అయితే బాలాజీ వినకపోవడంతో భాదితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలాజీని అరెస్టు చేసి యువతిని వైద్య పరీక్షలకు తరలించి కేసు విచారణ చేస్తున్నామని హుళిమావు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+