Bangalore: ఐటీ హబ్ లో సాఫ్ట్ వేర్ కంపెనీ భవనంలో అగ్నిప్రమాదం, కాలి బూడిద, సెక్యూరిటీ గార్డులు ?
ఐటీ హబ్ బెంగళూరులో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. బెంగళూరులోని బాణసవాడి ఔటర్ రింగ్ రోడ్ లోని ఓ భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం కారణంగా ఐదు అంతస్తుల భవనం పూర్తిగా కాలి దగ్ధమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది.
ఈ ఘటన ఆదివారం అర్థరాత్రి 12 గంటలలు దాటిన తరువాత జరిగిందని పోలీసులు అంటున్నారు. స్థానికులు, ఆ భవనం చుట్టుపక్కల వాళ్లు చూస్తుండగానే భవనంలో మంటలు చెలరేగి లక్షలాది రూపాయల విలువైన వస్తువులు కాలి బూడిద అయ్యాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే అగ్నిప్రమాదం జరిగిన భవనంలో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ కూడా ఉందని పోలీసు అధికారులు తెలిపారు.

అగ్నిప్రమాదం జరిగిన భవనంలో చిక్కుకున్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ప్రాణాలతో బయటపడ్డారని పోలీసు అధికారులు తెలిపారు. సరైన సమయానికి అగ్నిమాకప సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు సెక్యూరిటీ గార్డులను కాపాడారు. ఈ ఘటనలో ఫర్నీచర్ షాపు, ఓ కోచింగ్ సెంటర్, ఐటీ కంపెనీ పూర్తిగా దగ్ధమయ్యాయి.
గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తులో స్టాన్లీ ఫర్నిచర్ షోరూమ్ ఉందని, రెండవ అంతస్తులో కామెడ్ కొచింగ్ సెంటర్ ఉన్నాయని పోలీసులు తెలిపారు. మూడు, నాలుగవ అంతస్తుల్లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ ఉందని, భవనం మొత్తం పూర్తిగా దగ్ధం అయ్యిందని పోలీసులు అన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు.
రామమూర్తినగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సెలవు రోజు కావడంతో అక్కడ పని చేసే సిబ్బంది ఎవ్వరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం జరిగిందని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు. ఐటీ హబ్ బెంగళూరు నగరంలో అప్పుడప్పుడు ఇలాంటి అగ్నిప్రమాదాలు జరుగుతుండటంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications