కుప్పకూలిన ఫ్లై ఓవర్ గొడ: దుర్మరణం (వీడియో)

భోపాల్: ఫ్లై ఓవర్ గొడ కుప్పకూలి ఇద్దరు దుర్మరణం చెందిన సంఘటన భోపాల్ లో జరిగింది. తీవ్రగాయాలైన ఐదు మంది ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారని పోలీసులు చెప్పారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

భోపాల్ లోని బజరాయ్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ ఫ్లై ఓవర్ ఉంది. సోమవారం రాత్రి చాల మంది కూలి కార్మికులు ఫ్లై ఓవర్ కింద నిద్రపోయారు. మంగళవారం వేకువ జామున 1.30 గంటల సమయంలో ఫ్లై ఓవర్ కు నిర్మించిన గొడ కుప్పకూలిపోయింది.

గొడ శిథిలాలు కిందపడటంతో గాడనిద్రలో ఉన్న ఇద్దరి ప్రాణాలు సంఘటనా స్థలంలోనే పోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఐదు మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+