విదేశీ లేడీ డాక్టర్ పై అత్యాచారం చేసిన యోగా గురువు, యోగా శిక్షణ పేరుతో !
ఆమె అమెరికా నుండి వచ్చింది. మన దేశానికి చెందిన యోగాకు ఆకర్షితురాలైన ఆమె యోగాను అభ్యసించేందుకు భారత్‌కు వచ్చింది. ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసి యోగా క్యాంపులో చేరింది. అయితే అక్కడి యోగా గురువు మాత్రం అందుకు భిన్నంగా చేశారు. యోగా పేరుతో ఆమెను లొంగదీసుకుని ఆమెపై అత్యాచారం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. లక్షలు లక్షలు ఫీజు తీసుకున్న యోగా గురువు ఆమెపై అత్యాచారం చేశాడని కేసు నమోదు అయ్యింది.
ఈరోజు చేసిన తప్పుకు ఆ యోగా గురువు కటకటాల వెనక్కి వెళ్లాడు. ఇలా విదేశీ మహిళను మోసం చేసి లైగింక వేధింపులకు పాల్పడిన యోగా గురువు అసలు కథ బయటకు వచ్చింది.
విదేశీయులు భారతీయ సంస్కృతికి బానిసలు కావడం కొత్తేమీ కాదు. భారతదేశంలోని మట్టి అలాంటిది. భారతదేశం మట్టి ఎవరినైనా చాలా త్వరగా ఆకర్షిస్తుంది. యోగా నేర్చుకోవాలని నిర్ణయించుకున్న అమెరికాలో జన్మించిన వైద్యురాలు ఆమె భారతీయ స్నేహితురాతో మాట్లాడి కర్ణాటకలో మంచి యోగా గురువు గురించి ఆరా తీసింది.

ఆ లేడీ డాక్టర్ అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందినది. అయితే ఆమె యోగా నేర్చుకునేందుకు ఇండియా వచ్చేందుకు సిద్ధమైంది.
యోగా టీచర్ కోసం వెతుకుతున్న ఈ డాక్టర్ భారతీయ సంతతికి చెందిన తన స్నేహితురాలు ద్వారా ఒక యోగా గురువు గురించి తెలుసుకుంది. తరువాత బారతదేశంలోని యోగా గురువుకు సంబంధించిన లింక్ అమెరికా మహిళకు పంపించి మీరు ఇక్కడ యోగా నేర్చుకోవచ్చు అని చెప్పింది. అప్పుడు లేడీ డాక్టర్ కు ఓ క్లారిటీ వచ్చింది.
కొంత డబ్బు చెల్లించి ఆన్‌లైన్‌లో యోగా ప్రాక్టీస్‌లో చేరింది.
యోగా పట్ల ఆకర్షితులవుతున్న విదేశీయులు వెనక్కి తిరిగి చూడకుండా గురువుల కోసం అడిగినంత డబ్బు చెల్లించడం చేస్తున్నారు. యోగా గురువులు చెప్పినట్లు విదేశీయులు వింటుంటారు. ఇలా యోగా గురువు ప్రదీప్ ఉల్లాల్ విదేశీ మహిళపై కన్ను వేశాడు. ఈ యోగా కేంద్రం చిక్కమగళూరు తాలూకాలోని మల్లెనహళ్లిలో ఉంది. ప్రదీప్ స్వస్థలం బంట్వా.ళ. ఇప్పటికీ ఈ యోగా కేంద్రానికి వచ్చేవారిలో ఎక్కువ మంది విదేశీయులే ఉన్నారు.
ఆన్ లైన్ శిక్షణ పొందుతున్న అమెరికా లేడీ డాక్టర్ ను 2020లో చిక్కమగళూరుకు పిలిపించుకున్న ప్రదీప్ ఆమెను శారీరకంగా లొంగ దీసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. చాలా కాలం పాటు తనతో మాత్రమే యోగా గురువు చనువుగా ఉంటున్నాడన్ని, ఆయన్ను పెళ్లి చేసుకోవాలని అమెరికా లేడీ డాక్టర్ అనుకుంది అయితే యోగాశ్రయానికి వచ్చి వెళ్లే మహిళలతో యోగా గురువు ప్రదీప్ చనువుగా ఉంటున్నాడని, వారిని శారీరకంగా లొంగదీసుకుంటున్నాడని, తనను యోగా గురువు మోసం చేశాడని తెలుసుకున్న అమెరికా లేడీ డాక్టర్ రగిలిపోయింది. యోగా గురువు ప్రదీప్ తనపై అత్యాచారం చేశాడని విదేశీ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు యోగా గురువు ప్రదీప్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications