క్లైమాక్స్ లో వెనక్కి తగ్గిన మేడమ్, చివరి నిమిషంలో పోటీ నుంచి జంప్ !
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని అన్ని పార్టీ నాయకులు అనేక ప్రయత్నాలు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేసి ఎమ్మెల్యే టిక్కెట్లు సంపాధించుకోవాలని నానా తంటాలు పడ్డారు. అయితే చాలా మంది సీనియర్లు మాత్రం నిరాశ చెందారు.
మాజీ సీఎంలు, మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలకు ఈపారి అసెంబ్లీ ఎన్నికల్లో పలు పార్టీల హైకమాండ్ అనేక మంది నాయకులకు మొండిచెయ్యి చూపించింది. టిక్కెట్లు దక్కకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది నాయకులు స్వతంత్ర పార్టీ అభ్యర్థులుగా నామినేషన్లు వేసి వాళ్లు ఉంటున్న సొంత పార్టీ నాయకులకు నిద్రలేకుండా చేశారు.

ఇలాంటి నాయకుల్లో బెంగళూరులోని చిక్కపేట్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ నాయకురాలు గంగాంబికే అలియాస్ గంగాంబికే మల్లికార్జున్ కూడా ఉన్నారు. బీబీఎంపీ మాజీ మేయర్ అయిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు గంగాంబికే బెంగళూరులోని చిక్కపేట నియోజక వర్గం అసెంబ్లీ సీటును ఆశపడ్డారు.
అయితే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మాత్రం చివరి క్షణంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్ వీ దేవరాజ్ కు ఇచ్చారు. ఆర్ వీ దేవరాజ్ మీద స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానని గంగాంబికే సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు కచ్చితంగా ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని గంగాంబికే కాంగ్రెస్ పార్టీ నాయకులను డిమాండ్ చేశారు.
అయితే నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు అయిన సోమవారం మాజీ మేయర్ గంగాంబికే ఆమె నానిమేషన్ పత్రాలు ఉపసంహరించుకుని అసెంబ్లీ ఎన్నిల నుంచి తప్పుకున్నారు. అధికారంలోకి వస్తే మీ అసలు బండారం బయటపెడుతామని సొంత పార్టీకి చెందిన కొందరు నాయకులు గంగాంబికేని హెచ్చరించడంతో ఆమె వెనక్కి తగ్గారని తెలిసింది.












Click it and Unblock the Notifications