చపాతీలు చెయ్యమని చెప్పిన భర్త బయటకు వెళ్లాడు. భార్యకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే ?

బెంగళూరు: బెంగుళూరు గ్రామీణ సమీపంలోని పర్వత ప్రాంతంలోని జిల్లా తుమకూరు గతంలో శరణార్థులు స్థిరపడిన ప్రాంతంగా పేరు తెచ్చుకుంది. అయితే అదే తుమకూరు జిల్లా నేడు అక్షరాలా రౌడీల జిల్లాగా మారిపోయిందని సందేహం కలుగుతోందని ఆ జిల్లాలోని సామాన్య ప్రజలు అంటున్నారు. దానికి కారణం ఇటీవల తుమకూరు జిల్లాలో నేరాలు ఆ రకంగా పెరిగిపోతున్నాయి.

తుమకూరు నగరానికి చెందిన రౌడీ షీటర్ చేయకూడని పనులన్నీ చేశాడు. ఇప్పటికే హత్యలు, హత్యాయత్నాలు, లూటీలు, సెటిల్ మెంట్లు ఇలా అనేక నేరాలు అన్ని చేశాడని పోలీసులు అతని మీద కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. అనేకసార్లు జైలుకు వెళ్లి వచ్చిన ఆ రౌడీషీటర్ తాను మారిపోయానని, గతంలో చేసిన తప్పులు ఇక మీద చెయ్యనని, ఇప్పుడు రౌడీయిజం వదిలేస్తానంటూ తిరుగుతున్నాడు.

A former rowdy sheeter who was doing real estate business was brutally murdered

చేసిన పాపాలు వెంటాడుతాయని పెద్దలు చెబుతున్నారు. అయితే ఆ రౌడీషీటర్ గతంలో చేసిన పాపాలు అతన్ని ఈ జన్మలోనే వెంటాడాయి. చేసినా పాలు ఆ రౌడీషీటర్ ను వదలకుండా వెంటాడాయి. ఎవరికి ఆ రౌడీషీటర కారణంగా ఎంతటి అన్యాయం జరిగిందో తెలీదు కాని ఆ రౌడీషీటర్ కు వేసిన స్కెచ్ పక్కాప్లాన్ అమలు చేసి అతన్ని ఈ భూమిమీద లేకుండా చేశారు.

భార్యకు చపాతీలు చెయ్యాలని, వెంటనే వచ్చేస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన రౌడీషీటర్ దారుణ హత్యకు గురైనాడు. మారుతి అలియాస్ పొలార్డ్ అలియాస్ రౌడీషీటర్ పొలార్డ్ అనే యువకుడు దారుణ హత్యకు గురైనాడు. ఇటీవలే అన్నీ వదిలేసి సైలెంట్ గా ఉంటున్న మారుతిని పక్కాప్లాన్ తో చంపేసిన ప్రత్యర్థులు అతని శవాన్ని విసిరేసి వెళ్లిపోయారు.

A former rowdy sheeter who was doing real estate business was brutally murdered

జైలు నుంచి బయటకు వచ్చి కోర్టు వాయిదాలకు తిరుగుతున్న రౌడీషీటర్ మారుతి ఏడాదిన్నర క్రితం అతను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటున్నాడు. రౌడీయిజానికి దూరంగా ఉంటున్న మారుతి అతని భార్యతో హ్యాపీగా ఉంటూ సైలెంట్ గా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. అయితే పొలార్డ్ చేసిన తప్పు ఏమిటంటే వెనుకా ముందు ఆలోచించకుండా ఒంటరిగా బయటకు వెళ్లడం.

గతంలో మారుతి చేసిన తప్పులు కారణంగా అతను దారుణంగా హత్య చేయబడ్డాడు. విషాదం ఏమిటంటో మారుతి ప్రస్తుతం భార్య గర్భవతి. చపాతీలు చేసి తినడానికి రెడీగా ఉన్న గర్బవతి అయిన భార్య మారుతి వస్తాడని ఎదురు చూడటంతో అతను సజీవంగా రాకపోవడం, అతన్ని చంపేశారని పోలీసులు వచ్చి చెప్పడంతో కుప్పకూలిపోయింది. మొత్తం మీద తుమకూరులో మరోసారి పాతకక్షలు పడగవిప్పడంతో రౌడీషీటర్ దారుణ హత్యకు గురైనాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+