నాలుగేళ్ళ చిన్నారిపై నలుగురి అత్యాచారం, నిందితుల్లో బాలిక బంధువు
చాక్లెట్ ఆశచూపి ఓ నాలుగేళ్ళ చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ముంబాయి : ముంబాయి లో ఘోరం చోటుచేసుకొంది. నాలుగేళ్ళ చిన్నారికి చాక్లెట్ ఆశచూపి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కిరాతకులు.అంతేకాదు ఆ చిన్నారిని చంపి చెత్తకుండీలో వేసివెళ్ళిపోయారు. ఈ దారుణానికి పాల్పడిన వారిలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మరొకరికోసం పోలీసులు గాలిస్తున్నారు..
ముంబాయిలో నాలుగేళ్ళ చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి సామూహిక అత్యాచారం చేశారు దుండగలు. ముంబై శివరులోనిని భయాండర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకొంది.
చాక్లెట్ ఇస్తామని ఆశచూపిన దుండగులు ఆ బాలిక ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్ళారు. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ బాలికను హత్య చేసి చెత్తకుప్పలో పారేశారు.

స్థానికులు చెత్తకుప్పలో శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. పరారీలో ఉన్న నిందితుడు బాలికకు సమీప బంధువుగా పోలీసులు గుర్తించారు.
చిన్నారిపై అత్యాచారం చేసి, ఆ తర్వాత హత్య చేసినట్టుగా పోస్టుమార్టం నివేదిక తెలుపుతోంది. ఈ ఘటన ముంబాయిలో సంచనలం రేపుతోంది. బాలిక తప్పిపోయిందని కుటుంబసభ్యులు ఫిర్యాదుచేసిన మరునాడే బాలిక మృతదేహం చెత్త కుప్పలో దొరికింది.












Click it and Unblock the Notifications