Viral Video: కల్మషం లేని ప్రేమ అంటే ఇదే.. వైరల్ అయిన చిన్నారుల వీడియో..
కొంత మంది డబ్బున్నవారు పేదవారితో మాట్లాడేందుకు ఇష్టపడరు. అస్సలు పేదవారిని వారి పక్కకే రానివ్వరు. మనుషుల మధ్య తేడా చూపే మనుషులకన్నా అందరిని ఒకేలా చూసే పశువులే గొప్ప అని ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. నిరాశ్రయులైన ఇద్దరు చిన్నారులు బతకడం కోసం రోడ్డుపై బెలూన్లు అమ్ముకుంటూ కుక్కతో ఆడుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
దీపాంషు కబ్రా..
ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంషు కబ్రా ఆగస్టు 9న ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోకు దాదాపు 16,000 పైగా వ్యూస్ వచ్చాయి. మీకు చెడ్డ రోజు ఉంటే, ఈ వీడియో మీ ముఖంలో చిరునవ్వు తీసుకురావడం ఖాయం అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ వీడియోలో కారులో కూర్చున్న పెంపుడు కుక్కను చూడవచ్చు. చిన్న బెలూన్ విక్రేతలు కారు కిటికీ వెలుపల గుమిగూడి కుక్కతో ఆడుకోవడం చూడవచ్చు.

చిన్నారుల ముఖల్లో ఆనందం
ఇద్దరు పిల్లలు నిజంగా కుక్కల సహవాసాన్ని ఆనందిస్తున్నట్లు చూడవచ్చు. కుక్క కూడా అబ్బాయిలను చేరుకోవడానికి, వారితో ఆడుకోవడానికి తన పావును చాచడానికి ప్రయత్నిస్తుంది. అందులో ఒక అబ్బాయి కుక్క బుగ్గలపై ముద్దు కూడా పెట్టాడు. ఒకరికొకరు ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో వారి ముఖాల్లోని చిరునవ్వులు చెబుతున్నాయి. వీడియో కేవలం జంతు ప్రేమికులకు మాత్రమే కాదు అందరికి.
प्रेम ही हम सभी का आधार है,
— Dipanshu Kabra (@ipskabra) August 9, 2022
ऊँच-नीच, भेद-भाव, आदि तो सिखा दिया जाता है... pic.twitter.com/hdUgZHSb6A












Click it and Unblock the Notifications
