యువతిపై రేప్, హత్య: బాలికపై యాసిడ్ దాడి, విషమం
కర్నూలు/అలీగఢ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు నగర శివారులోని జొహరాపురం వద్ద దారుణం జరిగింది. ఓ యువతిపై అత్యాచారం చేసిన దుండగులు, అనంతరం ఆమెను హత్య చేశారు. మృతురాలు కర్నూలు నగరంలోని గణేష్‌నగర్‌కు చెందిన శ్రావణిగా గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడేవున్న ఓ బైకును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బాలికపై యాసిడ్ దాడి: తీవ్ర గాయాలు

అలీగఢ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్‌లో ఓ 17ఏళ్ల బాలికపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ కుమార్తె అయిన ఆమె పదకొండో తరగతి చదువుతూ సాయంత్రం వేళ ఒక షోరూమ్‌లో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తోంది. కాగా, ఆమె గురువారం రాత్రి తన విధులు ముగించుకుని వస్తుండగా బైకుపై వచ్చిన యువకులు యాసిడ్ దాడి చేసి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications