రిసెప్షన్ లో పెళ్లి నిలిపేసిన గుట్కా: పెళ్లి కుమార్తె రివర్స్, వధువు దెబ్బకు గుట్కా మిగిలింది !

పెళ్లి రోజు వరుడు గుట్కా తింటూ అందరినీ పలకరిస్తున్న విషయం గుర్తించిన వధువు పెళ్లి రద్దు చేసుకుని చుక్కలు చూపించిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని బలియా జిల్లా మురార్ పట్టే ప్రాంతంలో జరిగింది. పెద్దలు, పోలీసులు

లక్నో: పెళ్లి రోజు వరుడు గుట్కా తింటూ అందరినీ పలకరిస్తున్న విషయం గుర్తించిన వధువు పెళ్లి రద్దు చేసుకుని చుక్కలు చూపించిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని బలియా జిల్లా మురార్ పట్టే ప్రాంతంలో జరిగింది. పెద్దలు, పోలీసులు ఎంత చెప్పినా వధువు మాత్రం వెనక్కి తగ్గలేదు.

మురార్ పట్టే ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల యువతి వివాహం సమీపంలోని ఊరికి చెందిన బాలాసింగ్ అనే వ్యక్తితో నిశ్చయం అయ్యింది. మంగళవారం రాత్రి బాలాసింగ్ తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మురార్ పట్టేప్రాంతానికి చేరుకున్నారు.

బంధువులతో పిచ్చపాటిగా !

బంధువులతో పిచ్చపాటిగా !

వధువు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన రిసెప్షన్ వేదిక మీదకు బాలాసింగ్ వెళ్లాడు. వధువు సైతం వరుడు బాలాసింగ్ పక్కన వచ్చి నిలబడింది. ఆ సందర్బంలో బాలాసింగ్ నోటి నిండా గుట్కా వేసుకుని దర్శనం ఇచ్చాడు. వేధిక మీదకు వచ్చివెలుతున్న పెళ్లి పెద్దలు, బంధువులతో బాలాసింగ్ పిచ్చపాటిగా మాట్లాడుతున్నాడు.

నువ్వు గుట్కా తింటా అంటే ఎస్ !

నువ్వు గుట్కా తింటా అంటే ఎస్ !

ఆ సందర్బంలో బాలాసింగ్ నోటి నిండా గుట్కా వేసుకున్నాడని వధువు గమనించింది. నీవు గుట్కా వేసుకుంటావా ? అంటూ వరుడు బాలాసింగ్ ను ప్రశ్నించింది. ఎందుకు వేసుకోనూ, లక్షణంగా నేను గుట్కా తింటానని బాలాసింగ్ సమాధానం ఇచ్చాడు.

 ఆమెకు కాలిపోయింది !

ఆమెకు కాలిపోయింది !

అంతే వధువుకు మండిపోయింది. గుట్కాలు తినే వ్యక్తిని, మందు తాగే మనిషిని నేను వివాహం చేసుకోనని చెప్పి రిసెప్షన్ వేదిక మీద నుంచి కిందకు దిగేసింది. పెద్దలు నచ్చచెప్పినా ఆమె మాట వినలేదు. తాను గుట్కా తినడం మానేస్తానని వరుడు కూడా హామీ ఇచ్చాడు.

పంచాయితీ !

పంచాయితీ !

ఎవ్వరూ చెప్పినా నేను మనసు మార్చుకోనని వధవు తేల్చి చెప్పింది. బుధవారం ఉదయం వరకు ఇదే పంచాయితీ జరిగింది. అయితే వధువు మాత్రం నేను పెళ్లి చేసుకును అంటే చేసుకోను అంటూ ఒంటి కాలిమీద నిలబడింది.

వరుడికి గుట్కానే మిగిలింది !

వరుడికి గుట్కానే మిగిలింది !

ఇక ఈ పంచాయితీ తెగదని భావించిన వరుడి కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కల్యాణమండపం చేరుకుని వధువుకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. అయితే ఆమె ఎవ్వరి మాట వినకపోవడంతో పెళ్లి రద్దు అయ్యింది. వరుడు మాత్రం గుట్కా నములుకుంటూ తన సొంత ఊరికి వెళ్లిపోయాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+