girl: లవ్ మ్యారేజ్, భార్యను ఎంబీఏ చదివిస్తున్న భర్త, అర్దరాత్రి ఏం జరిగిందో, ఇంట్లోనే శవమైన యువతి !
ఫ్యామిలీల వ్యతిరేకతను సైతం లెక్కచేయకుండా మూడేళ్ల క్రితం ప్రేమికులు పెళ్లి చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న యువతి కాలేజ్ లో చదువుతోంది. రాత్రి ఇంట్లో ఆమె శవమైయ్యింది.
బెంగళూరు/తుమకూరు: జీవితంలో చాలా మంది ప్రేమలో పడుతుంటారు. ఈ రోజుల్లో యువతి యువకుడు ప్రేమించుకోవడం సర్వసాధారణమైయ్యింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రేమించుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. అయితే ప్రేమించి సిన్సియర్ గా కొంతమంది మాత్రమే పెళ్లి చేసుకుంటున్నారు. ప్రేమించిన వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకో అని కుటుంబ సభ్యులు చెబితే వారి ఆనందానికి హద్దులు లేకుండాపోతాయి. ఇరు వైపుల కుటుంబ సభ్యులు వ్యతిరేకించిన సమయంలో ప్రేమికులు వారిని ఎదిరించారు. కుటుంబ సభ్యుల వ్యతిరేకతను సైతం లెక్కచేయకుండా మూడేళ్ల క్రితం ప్రేమించుకున్న ప్రేమికులు పెళ్లి చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న యువతికి కాలేజ్ లో చదువుతోంది. రాత్రి ఇంట్లో ఆమె శవమైయ్యింది. భర్త టార్చర్ మొదలైయ్యిందని, అందుకే జీవితంపై విరక్తి పెంచుకుందని కుటుంబ సభ్యులు భర్త మీద కేసు పెట్టారు.

లవర్స్
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని గుబ్బి తాలూకాలోని మదనఘట్ట గ్రామానికి చెందిన మోనికా (21) అనే యువతికి, తుమకూరుకు చెందిన అభిరామ్ అనే యువకుడు కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమించుకున్నారు. ప్రేమికులు మోనికా, అభిరామ్ కులాలు వేరు కావడంతో వారి పెళ్లికి ఇరు వైపుల కుటుంబం సభ్యులు, బంధువుల నుంచి తీవ్రస్థాయిలో నుంచి వ్యతిరేకత వచ్చింది. పెళ్లికి కుటుంబ సభ్యులను ఒప్పించాలని అభిరామ్, మెనికా అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు.

గుడిలో పెళ్లి చేసుకున్న ప్రేమికులు
మోనికా, అభిరామ్ వారి కుటుంబ సభ్యులను పట్టించుకోకుండా మూడు సంవత్రాల క్రితం గుడిలో పెళ్లి చేసుకుని తుమకూరులోని హనుమంతనరలో నివాసం ఉంటూ కాపురం చేస్తున్నారు. కులాంతర వివాహం చేసుకున్న మోనికా, అభిరామ్ కు వారి స్నేహితులు కొందరు కొంతకాలం అండగా నిలిచారు. ప్రస్తుతం ఆమె తన భర్త అభిరామ్‌తో కలిసి మోనికా తుమకూరు నగరంలోని హనుమంతనగరలో అద్దె ఇంట్లో నివసిస్తోంది.

కాలేజ్ లో చదువుతున్న యువతి
తన భార్య మంచి జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుందని అభిరామ్ అతని భార్య మోనికాను కాలేజ్ లో చేర్పించాడు. తుమకూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో మోనికా బీసీఏ చదువుతోంది. మోనికా ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లి వస్తోంది. భర్త అభిరామ్ అతని భార్య మోనికాను కాలేజ్ దగ్గర డ్రాప్ చెయ్యడం, సాయంత్రం కాలేజ్ నుంచి ఇంటికి పిలుచుకుని రావడం చేస్తున్నాడు. అయితే ఆదివారం అర్దరాత్రి దాటిన తరువాత మోని ఆమె నివాసం ఉంటున్న ఇంటిలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

భర్త మీద కేసు నమోదు
భర్త అభిరామ్ వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని మోనిక తల్లిదండ్రులు ఆరోపిస్తూ తుమకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తుమకూరు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మోనిక భర్త అభిరామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోనికా ఆత్మహత్య కేసు నమోదు చేసిన తుమకూరు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. కులాంతర వివాహం చేసుకున్న యువతి జీవితాంతం భర్తతో కలిసి సంతోషంగా జీవించాల్సిందిపోయి మూడు సంవత్సరాలకే ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కాలేజ్ స్నేహితులు హడలిపోయారు.












Click it and Unblock the Notifications