ప్రియుడి తండ్రితో లేచిపోయిన ప్రియురాలు, మస్త్ మజా చేసి క్లైమాక్స్ లో !

కాన్పూర్/న్యూఢిల్లీ: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. అందరు ప్రేమికుల్లాగే యువతి, యువకుడు బైక్ లో విహారయాత్రలకు తిరిగేశారు. సినిమాలు, షికార్లకు తిరిగి ఎంజాయ్ చేశారు. అయితే ప్రియుడికి పావలా చాక్లెట్ ఇచ్చిన ప్రియురాలు బాయ్ ఫ్రెండ్ తండ్రితో లేచిపోయి మామతో మస్త్ మజా చెయ్యడంతో అందరూ బిత్తరపోయారు.

కాన్పూర్ లో కమలేష్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కమలేష్ కు అమిత్ (21) అనే కుమారుడు ఉన్నాడు. కాన్పూర్ లోనే నివాసం ఉంటున్న ఓ యువతిని అమిత్ ప్రేమిస్తున్నాడు. యువతి కూడా అమిత్ ను ప్రేమించడంతో ప్రేమికులు ఇద్దరూ రెండు సంవత్సరాల పాటు సినిమాలు, షికార్లకు తిరుగుతూ ఎంజాయ్ చేశారు.

girlfriend

అమిత్. అతని ప్రియురాలి మ్యాటర్ ఇరువైపు కుటుంబ సభ్యులకు తెలిసింది. ఇరు వైపుల కుటుంబ సభ్యులు పెళ్లికి వ్యతిరేకించకపోయినా ఇంత చిన్న వయసులో పెళ్లి చెయ్యడం మంచిదికాదని, రెండు సంవత్సరాల తరువాత పెళ్లి చేస్తామని అమిత్ కు అతని తండ్రి కమలేష్ చెప్పాడు.

తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించడంతో అమిత్, అతని ప్రియురాలు చాలా సంతోషించారు. ప్రతిరోజు ఫోన్ల్ చేసి గంటలు గంటలు ప్రియురాలితో మాట్లాడుతున్న అమిత్ ఆమెను అతని ఇంటికి పిలిపించుకుంటున్నాడు. ప్రియుడు అమిత్ ఇంటికి వచ్చి వెలుతున్న అతని ప్రియురాలు కాబోయే మామ కమలేష్ తో కూడా ఎక్కువ మాట్లాడటం మొదలుపెట్టింది.

రాత్రి ఫోన్ చేసి ప్రియురాలితో గంట సేపు మాట్లాడిన అమిత్ తరువాత నిద్రపోయాడు. మరుసటి రోజు అమిత్ కు షాకింగ్ సమాచారం తెలిసింది, తన తండ్రి కమలేష్ తో కలిసి తన ప్రియురాలు లేచిపోయిందని తెలుసుకున్న అమిత్ హడలిపోయాడు. ఇద్దరి మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో ఇరు వైపుల కుటుంబ సభ్యులు బిత్తరపోయారు.

girlfriend

అప్పటి నుంచి అమిత్ తండ్రి కమలేష్ తో పాటు అతనితో లేచిపోయిన యువతి కోసం కుటుంబ సభ్యులు గాలిస్తూనే ఉన్నారు. ఏడాది తరువాత యువతి కుటుంబ సభ్యులు పోలీసు కేసు పెట్టారు. కమలేష్ అతని కొడుకు ప్రియురాలితో కలిసి ఢిల్లీలోని అద్దె ఇంటిలో ఉంటున్నాడని తెలుసుకున్న కాన్పూర్ పోలీసులు పక్కాప్లాన్ ప్రకారం వారిని అదుపులోకి తీసుకున్నారు.

కొడుకు ప్రియురాలితో కలిసి పారిపోయిన కమలేష్ మీద అమ్మాయి కుటుంబ సభ్యులు కిడ్నాప్, అత్యాచారం కేసులు పెట్టారు. యువతికి వైద్యపరీక్షలు చేయించామని, కమలేష్ ను విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. కొడుకు ప్రియురాలితో కలిసి కాబోయే మామ లేచిపోయి తరువాత పోలీసులకు చిక్కిపోవడం హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+