మాజీ ప్రధాని ఫ్యామిలీకి చాలా క్లోజ్, పట్టపగలు నరికి చంపేసి ఎస్కేప్ !
బెంగళూరు/హాసన్: రాజకీయాల్లో ఉంటున్న వ్యక్తి మాజీ ప్రధాని ఫ్యామిలీకి సన్నిహితుడిగా ఉన్నాడు. వ్యాపారం చేస్తున్న ఆ వ్యక్తి మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఉదయం టిఫిన్ చేసి సొంత ఫ్యాక్టరీ దగ్గరకు వెళ్లిన రాజకీయ నాయకుడిని అతి దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.
కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డీ. రేవణ్ణకు అత్యంత సన్నిహితుడైన గ్రానైట్ వ్యాపారి కృష్ణగౌడ్‌ను రౌడీలు పట్టపగలు నరికి చంపిన ఘటన కర్ణాటకలోని హాసన్‌లో చోటుచేసుకుంది.

రాష్ట్ర రాజధాని బెంగళూరు, కోస్తాలోని మంగళూరు, విజయపూర్‌లోని భీమతీరం, శివమొగ్గలో రోజురోజుకూ పెరిగిపోతున్న పట్టపగలు హత్యల ఉదంతాలు ఇప్పుడు హాసన్‌కు కూడా పాకిపోయాయి.
మాజీ ప్రధానమంత్రి హెచ్.డీ. దేవేగౌడ సొంత నియోజక వర్గం హాసన్‌లో రౌడీయిజం లేదు. అయితే ఇప్పుడు హాసన్ నగర శివార్లలోని పారిశ్రామికవాడలో ఓ గ్రానైట్ వ్యాపారి హత్యకు గురయ్యాడు. రోజూ ఉదయం తన సొంత గ్రానైట్ ఫ్యాక్టరీకి వెళ్లేవాడు. ఆ సమయంలో రోడ్డు పక్కన కారు ఆపి కారు దిగిన కృష్ణగౌడ్ (53)పై ఒక్కసారిగా దాడి చేసి దారుణంగా స్పాట్ లో నరికి చంపారు.

కృష్ణగౌడ్‌ను అతని గ్రానైట్ ఫ్యాక్టరీ ముందే రుణంగా హత్య చేనసి దుండగులు వేటకొడవళ్లతో నరికి చంపేశారు. ఈ ఘటన హాసన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరగగా, ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. జేడీఎస్ నాయకుడి దారణ హత్య తరువాత ఆ రహదారిని మూసివేసి బారికేడ్లు వేశారు. ఇప్పుడు హంతకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తరువాత హాసన్ లో ఇద్దరు జేడీఎస్ నాయకులు దారుణ హత్యకు గురైనారు.












Click it and Unblock the Notifications