Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bangalore bandh: బెంగళూరు బంద్, ఐటీ కంపెనీలు, విద్యాసంస్థలకు సెలవు !, వాటర్ ఎంట్రీతో అయోమయం !

బెంగళూరు: తమిళనాడుకు (tamil nadu) కావేరీ నీటిని విడుదల చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వివిధ సంస్థలు సెప్టెంబర్ 26వ తేదీ మంగళవారం బెంగళూరు (bengaluru) బంద్‌కు (bandh)పిలుపునిచ్చాయి. నగరంలోని ఫ్రీడమ్‌పార్క్‌లో పలు సంస్థలు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నాయి. రైతు నాయకుడు కురుబురు శాంతకుమార్‌ బెంగళూరు బంద్‌కు (bandh) పిలుపునిచ్చి వివిధ సంఘాలు సహకరించాలని ఆయన కోరారు.

బెంగళూరులోని (bengaluru)స్కూళ్లు, కాలేజీలు, ఫిలిం ఛాంబర్లు, ఐటీ కంపెనీలకు సెలవు ప్రకటించాలని శాంతకుమార్ విజ్ఞప్తి చేశారు. కావేరి నదీ జలాలపై చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని శాంతకుమార్ సిద్దరామయ్య ప్రభుత్వాన్ని కోరారు. బంద్‌పై జరిగిన సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ, పలు పౌర సంక్షేమ సంఘాలు, కన్నడ అనుకూల సంస్థలు సహా చాలా సంస్థలు పాల్గొన్నాయి.

A holiday for IT companies and educational institutions on the occasion of Bengaluru bandh for Cauvery water?

తమిళనాడుకు (tamil nadu) కావేరీ నీటిని విడుదల చేయడాన్ని నిరసిస్తూ బెంగళూరులో (bengaluru)వివిధ సంఘాలు నిరసనలు తెలిపి పలుచోట్ల ట్రాఫిక్‌ను నిలిపివేసేందుకు ప్రయత్నించాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను ఆమోదించి తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది. ఈమేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

తమిళనాడుకు (tamil nadu) 5,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలంటూ కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఇచ్చిన ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు సెప్టెంబర్ 21వ తేదీన నిరాకరించింది. తమిళనాడుకు (tamil nadu)నీటి విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మండ్యలో వివిధ సంస్థలు నిరసన తెలుతున్నాయి.

A holiday for IT companies and educational institutions on the occasion of Bengaluru bandh for Cauvery water?

కర్ణాటక రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా తమిళనాడుకు (tamil nadu)కావేరీ నీటిని విడుదల చేయలేమని కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించింది. ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ ఆగస్టులో రాష్ట్రంలో 73% తక్కువ వర్షపాతం నమోదైంది. కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించిన 195 తాలూకాల్లో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం నుంచి ఉపశమనం పొందే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

పంట నష్టం సర్వే ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం 161 తాలూకాలు తీవ్ర కరువును ఎదుర్కొంటున్నాయని, 34 తాలూకాలు మోస్తరు కరువును ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. సెప్టెంబరు 26వ తేదీన కర్ణాటక జలసంరక్షణ సమితి అధ్యక్షుడు కురుబురు శాంతకుమార్ బంద్‌ (bandh)ప్రకటించడంతో మాజీ ఎమ్మెల్యే, కన్నడ అనుకూల (chennai) ఉద్యమకారుడు వాటల్‌ నాగరాజ్‌ సోమవారం (bengaluru) నగరంలో వివిధ సంఘాల సమావేశం నిర్వహించి కర్ణాటకలో సమ్మె (bandh)తేదీని నిర్ణయించారు.

A holiday for IT companies and educational institutions on the occasion of Bengaluru bandh for Cauvery water?

తమిళనాడుకు (tamil nadu)కావేరీ నీటిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో బంద్‌కు (bandh) పిలుపునిచ్చారు. నగరంలో బంద్‌ నిర్వహిస్తున్నట్లు శాంతకుమార్‌ ప్రకటించడంతో సోమవారం వివిధ సంఘాల సమావేశాన్ని వాటల్‌ నాగరాజ్‌ ప్రకటించడంతో బెంగళూరు (bengaluru)బంద్ తేదీపై గందరగోళం నెలకొంది. సోమవారం ఇరువురు నేతలు సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. అయితే సెప్టెంబర్ 26వ తేదీన తలపెట్టిన బంద్‌ను (bandh) ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని రైతు సంఘం నాయకుడు శాంతకుమార్ ప్రకటించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+