మాల్దీవులకు వెళ్లాలనుకునే పర్యాటకులకు భారీ షాక్!
విశాలమైన తెల్లని ఇసుక బీచ్ లతో, మిరిమిట్లు గొలిపే పగడపు దిబ్బలతో ప్రపంచ పర్యాటకులను రారమ్మని పిలిచే అద్భుతమైన హాలిడే స్పాట్ మాల్దీవులు. నాలుగు వైపులా నీళ్లతో సుందరమైన ప్రకృతి దృశ్యాలతో కనువిందు చేసే మాల్దీవుల పర్యటన ఇకపై మరింత ప్రియం కానుంది. మాల్దీవులు సందర్శించాలనుకునే పర్యాటకులకు మాల్దీవుల ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది.
నిష్క్రమణ పన్నును పెంచిన మాల్దీవుల ప్రభుత్వం
ఇకనుంచి మాల్దీవులకు వెళ్లడానికి మాత్రమే కాదు అక్కడినుండి రావడానికి కూడా భారీగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి మాల్దీవులకు వెళ్లే పర్యాటకులు అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఎగ్జిట్ ఫీజు భారీగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిష్క్రమణ పన్నును ప్రస్తుతం ఉన్న దాని కంటే నాలుగు రెట్లు పెంచడానికి మాల్దీవుల ప్రభుత్వం సిద్ధమైంది. డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి ఈ విధానం అమలులోకి రానుంది.

విమాన తరగతుల బట్టి నిష్క్రమణ ఫీజు
మాల్దీవులకు వెళ్ళిన పర్యాటకులు దేశ పర్యటన అనంతరం తిరిగి తమ తమ దేశాలకు వెళ్లే సమయంలో ప్రయాణికుల నుంచి ఎగ్జిట్ ఫీజులు వసూలు చేస్తుంది. ఇక విమాన తరగతులు బట్టి చార్జీలను భిన్నంగా వసూలు చేసేందుకు మాల్దీవ్స్ ప్రభుత్వం రెడీ అయింది. ఎకానమీ తరగతుల వారికి ప్రస్తుతం 30 డాలర్లుగా ఎగ్జిట్ ఫీజు ఉండగా దానిని 50 డాలర్లకు పెంచింది.
బిజినెస్, ఫస్ట్ క్లాస్ వారికి నిష్క్రమణ పన్ను బాదుడే
ఇక బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు 60 డాలర్ల నుంచి 120 డాలర్లను చేసింది. ఫస్ట్ క్లాస్ ప్రయాణికులకు ప్రస్తుతం 90 డాలర్లు ఉండగా 240 డాలర్లకు పెంచింది. ఇక ప్రైవేటు జెట్ ప్రయాణికులకు ప్రస్తుతం 120 డాలర్లు ఉండగా డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి వారు 480 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.
ప్రతీ ఒక్కరికీ విమాన తరగతి ఆధారంగా ఫిక్స్ చేసిన పన్ను
ఇక వారి పాస్ పోర్ట్ తోను, వయసుతోను, ప్రయాణ దూరంతో, ప్రయాణ సమయంతోను సంబంధం లేకుండా మాల్దీవులు పౌరులు కానీ ప్రతి ఒక్కరికి ఈ పన్ను వర్తిస్తుంది. ఎగ్జిట్ ఫీజు పెంచుతున్నట్టు ఇటీవల ప్రకటన చేసిన మాల్దీవుల ప్రభుత్వం ఈ పన్ను నుండి వచ్చే ఆదాయం దేశం యొక్క ప్రాథమిక రవాణా కేంద్రమైన వేలనా అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహణకు ఖర్చు చేయనున్నట్టు పేర్కొంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications