Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పోర్న్ వీడియోలోని హీరోయిన్ నా భార్య, అర్దరాత్రి బెడ్ రూమ్ లోకి వెళ్లి సూదితో ?

రాజ్ కోట్/గుజరాత్: మార్కెటింగ్ రంగంలో ఉంటున్న భర్త కొత్త కొత్త మొబైల్ ఫోన్లు కొనుగోలు చేస్తున్నాడు. ఇప్పటికే వివాహం చేసుకున్న అతను ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కొత్త ఫోన్ కొనుగోలు చేసి పోర్న్ వీడియోలు చూశాడు. ఓ వీడియో చూసిన భర్త ఆ పోర్న్ వీడియోలో ఉన్నది తన భార్య అని తెలుసుకుని రగిలిపోయాడు. బియ్యం బస్తాలు కుట్టే పెద్ద సూది తీసుకున్న భర్త అర్దరాత్రి బెడ్ రూమ్ లో ఉన్న భార్య ముందు ప్రత్యక్షం అయ్యాడు.

తాను చూస్తున్న పోర్న్ వీడియోలోని మహిళ తన భార్య అని అనుమానిస్తూ గుజరాత్ లోని రాజ్‌కోట్‌లో నివాసం ఉంటున్న వ్యక్తి రాత్రి జ్యూట్ బ్యాగ్ కుట్టేందుకు ఉపయోగించే పెద్ద సూదితో అతని భార్య సున్నితమైన భాగాల్లో ఇష్టం వచ్చినట్లు పొడిచి గాయపరిచాడు. తల్లిని కాపాడేందుకు వెళ్లిన కూతురు మీద కూడా అతని దాడి చెయ్యడం కలకలం రేపింది.

A husband attacked his wife with a large needle after suspecting her of appearing in porn videos
తన భర్త హరేష్ భూప్కర్ నుంచి నన్ను కాపాడేందుకు వచ్చిన తన కూతురు అనుశ్రీ (24) గాయపడిందని బాధితురాలు గీతా భూప్కర్ (45) పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గీతా ఫిర్యాదు మేరకు రాజ్ కోట్ లోని యూనివర్శిటీ పోలీసులు ఆమె భర్త హరేష్ భూప్కర్ ను అరెస్ట్ చేశారు. బాధితులుగీతా, ఆమె కుమార్తె అనుశ్రీని చికిత్స నిమిత్తం రాజ్‌కోట్‌ సివిల్‌ ఆస్పత్రిలో చేర్పించామని పోలీసులు తెలిపారు.

గీత ఇద్దరు పిల్లల తల్లి. గీతాకు 24 ఏళ్ల అనుశ్రీ అనే కుమార్తె, కాలేజ్ లో చదువుతున్న 18 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. మార్కెటింగ్ రంగంలో ఉంటున్న తన భర్త హరేష్ కొత్తగా స్మార్ట్ మొబైల్ ఫోన్ కొని పోర్న్ వీడియోలు చూడటానికి అలవాటు పడ్డాడని అతని భార్య గీతా పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో గీతా ఆమె ప్రేమికుడితో కలిసి పోర్న్ వీడియోలలో నటిస్తోందని ఆరోపిస్తూ ఆమెతో భర్త హరేష్ గొడవ పడ్డాడని తెలిసింది.

గీతా గత వారం ఇదే విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. గీతా గత వారం పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎఫ్‌ఐఆర్ నమోదు కాకముందే కుటుంబ సభ్యులు ఆ విషయాన్ని రాజీ చేసి సెటిల్ చేసుకున్నారని పోలీసులు అంటున్నారు. అయితే భార్య గీతా పోర్న్ వీడియోల్లో నటిస్తూ ఎంజాయ్ చేస్తోందని, దాని అంతు చూడాలని ఆమె భర్త రగిలిపోయాడు.

A husband attacked his wife with a large needle after suspecting her of appearing in porn videos

రాత్రి గీతా నిద్రిస్తున్న సమయంలో హఠాత్తుగా ఆమె వద్దకు వెళ్లిన హరేష్ ధాన్యం బస్తాలు కుట్టేందుకు ఉపయోగించే పెద్ద సూదితో ఆమె మీద దాడి చేశాడు. ఆమె కేకలు వేయడంతో, పక్క రూమ్ లో ఉన్న ఆమె కుమార్తె అనుశ్రీ ఆమెను రక్షించడానికి వెళ్లింది. అయితే కూతురిపై కూడా హరేష్ దాడి చేసి గాయపరిచాడు.

గీతాకు ఆమె కడుపు, రెండు చేతులు, ఒక కాలు, ఆమె సున్నితమైన భాగాలపై గాయాలు కాగా, ఆమె కుమార్తె చేతులపై గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మొత్తం మీద పోర్న్ వీడియోలు చూస్తున్న భర్త ఓ వీడియోలో ఉన్నది తన భార్య అని అనుమానం పెంచుకోవడంతో వారి కాపురం కొల్లేరు అయిపోయింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+