పెళ్లి చూపులు హైదరాబాద్ లో హిట్.. పక్క చూపులు బెంగుళూరులో ఫట్
బెంగుళూరు : 'పెళ్లి చూపులు'.. మొన్నీమధ్యే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి చూపులకు వెళ్లాల్సిన హీరో ఓ తప్పు అడ్రస్ కు వెళ్లడం.. అక్కడ హీరోయిన్ ను పెళ్లి చూపులు చూడడం.. ఆ తర్వాత అసలు కెమిస్ట్రీ మొదలవడం.. ఇదీ సింపుల్ గా 'పెళ్లి చూపులు' కథ.
ఇప్పుడు చెప్పుకోవాల్సిందిక 'పక్క చూపులు' కథ. అక్కడ హీరో గారు తప్పుడు అడ్రస్ కు వెళ్లి పెళ్లి చూపులు చూసొస్తే..! ఇక్కడ ఓ వ్యక్తి ఏకంగా తన పెళ్లిలోనే.. మరో అమ్మాయితో పక్క చూపులు కానిచ్చేశాడు. వ్యవహారం అక్కడితో ఆగితే విషయం వార్తల్లోకి ఎక్కేది కాదేమో..! కానీ తాను పెళ్లి చేసుకున్న అమ్మాయిని పక్కనబెట్టి, పెళ్లిలో తాను పక్క చూపులు చూసిన అమ్మాయి మెడలో తాళిబొట్టు కట్టేశాడు సదరు 'పక్క చూపులు' కథానాయకుడు.

అసలు విషయమేంటంటే.. బెంగుళూరుకు చెందిన కేఆర్ నగర్ నివాసి అనిల్ (27) జూన్ లో కావ్య అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అయితే అదే పెళ్లిలో కావ్య స్నేహితురాలిని చూసి మనసు పడ్డాడు. కట్ చేస్తే.. ఆషాఢ మాసమని భార్య పుట్టింటికి వెళ్లడం.. భీముని అమావాస్య పండుగ నెపంతో ఈ నెల 2వ తేదీన అనిల్ కూడా అత్తగారింటికి వెళ్లడం.. అనంతరం భార్య స్నేహితురాలితో జంప్ అవడం జరిగిపోయాయి.
ఆ తర్వాత తెలిసిందేంటంటే.. అనిల్ తన భార్య స్నేహితురాలిని శివమొగ్గకు తీసుకెళ్లి ఆమె మెడలో తాళి కట్టాడు. ఇంతలో అమ్మాయి కోసం వెతుకుతున్న తల్లిదండ్రులకు అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు. అనంతరం అనిల్ భార్య కావ్య స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications