Crime News: బీమా సొమ్ము కోసం ఓ వ్యక్తి చేసిన పని చూస్తే షాక్ అవ్వాల్సిందే..
రాజస్థాన్ జైపూర్ కు చెందిన శాలూ, మహేష్‌కు 2015లో వివాహం అయింది. ఇద్దరికీ ఓ పాప కూడా ఉంది. అయితే గత రెండేళ్లుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత మహేష్ శాలూ వద్దకు వెళ్లి మాట్లూడుకుని ఇంటికి తీసుకొచ్చాడు. అక్టోబర్ 5న శాలూ, ఆమె బంధువు రాజుతో కలిసి గుడికి వెళ్లింది. జైపూర్-సికర్ రహదారిపై హర్మదా సమీపంలో బైక్‌పై సమోద్ ఆలయానికి వెళుతుండగా ఎస్‌యూవీ వాహనం వీరిని ఢీకొట్టింది.

రూ.1.90 బీమా
భార్య మృతితో మహేష్ కన్నీరుమున్నీరయ్యారు. పాపం మహేష్ భార్య కోసం ఎలా ఏడుస్తున్నాడో చూడండి అంటూ స్థానికులు బాధపడ్డారు. అయితే శాలూ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది. ఆమె నామినీ అయిన భర్తకు రూ.1.90 బీమా సొమ్ము వస్తుందని పోలీసులు గుర్తించారు. ఇంత పెద్ద మొత్తంలో ఆమె బీమా సొమ్ము రావడంపై పోలీసులకు అనుమానం వ చ్చింది. దీంతో అస్సలు విషయం బయటకొచ్చింది.

గృహ హింస కేసు
మహేష్ అదుపులోకి తీసుకుని విచారించగా.. తమకు పెళ్లైన రెండు సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతున్నట్లు మహేష్ చెప్పాడు. ఈ క్రమంలో 2019లో అతనిపై గృహ హింస కేసు నమోదు అయింది. దీంతో శాలూను చంపాలని మహేష్ నిర్ణయించుకున్నాడు. ఆమెతో మంచిగా ఉన్నట్లు నటించాడు. ఆమె పేరిట భారీగా ఇన్సూరెన్స్ చేయించాడు.

ముఖేష్ సింగ్ రాథోడ్
రౌడీ షీటర్ ముఖేష్ సింగ్ రాథోడ్ తో శాలూను చంపేందుకు మహేశ్ 10 లక్షల రూపాయల కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాడు. 5.50 లక్షల రూపాయల అడ్వాన్స్ కూడా చెల్లించాడు. ఆ తర్వాత శాలూకు ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. శాలూను 11 సార్లు గుడికి వెళ్తే మంచిదని చెప్పాడు. ఇది నమ్మిన శాలూ గుడికి వెళ్లడం ప్రాంభించింది. ఇలా అక్టోబరు 5న శాలూ, ఆమె బంధువు రాజు తో ఆలయానికి వెళ్లారు. ఇది గమించిన మహేష్ ఈ విషయాన్ని రౌడీ షీటర్ ముఖేష్ సింగ్ తెలిపాడు. దీంతో రౌడీ షీటర్ ముఖేష్ సింగ్ కారుతో వేగంగా వచ్చి శాలూ, రాజ్ బైక్ ను ఢీకొట్టాడు.

20 రోజుల క్రితం
ఈ ప్రమాదంలో శాలూ అక్కడికక్కడే మృతి చెందగా.. రాజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. "సుమారు 20 రోజుల క్రితం, మేము కేసులో బీమా కోణాన్ని కనుగొన్నాము. 2019లో శాలూ చంద్రపై వరకట్న వేధింపుల కేసు పెట్టడం ఆశ్చర్యంగా ఉంది" అని పోలీసు ఎస్‌హెచ్‌ఓ చెప్పారు. మహేష్ తో పాటు రౌడీ షీటర్ ముఖేష్ సింగ్ ను పోలీసలు అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications