భార్యను చంపేసి శుభ్రంగా శవాన్ని ఫ్రీజర్ లో పెట్టిన భర్త, ఇంటికి వెళ్లి !
భోపాల్/మధ్యప్రదేశ్: దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఢిల్లీలోని శ్రద్ధా వాకర్ కేసు తరహాలోనే మధ్యప్రదేశ్‌లో మరో ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఓ ఇంటి ఫ్రీజర్‌లో మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఆదివారం రాత్రి ఫ్రీజర్‌లో సుమిత్ర అనే 40 ఏళ్ల మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. నా సోదరిని ఆమె భర్తే హత్య చేశాడని సుమిత్ర సోదరుడు అభయ్ తివారీ ఆరోపించారు.
ప్రస్తుతం పోలీసులు సుమిత్ర భర్త భరత్ మిశ్రాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నారు. అయితే మృతురాలి భర్త భరత్ మిశ్రా తన కుమారుడి అంత్యక్రియల కోసం ముంబాయి నుంచి ఇంటికి రావాల్సి వచ్చిందని, అందుకే సుమిత్రా మృత దేహాన్ని ఫ్రీజర్‌లో ఉంచినట్లు పేర్కొన్నాడు. మృతురాలు సుమిత్రా జాండీస్‌తో వ్యాధితో బాధపడుతోందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

జాండిస్ తోనే సుమిత్రా జూన్ 30న చనిపోయిందని ఆమె భర్త మిశ్రా విచారణలో పేర్కొన్నాడు. తన సోదరి మరణం గురించి భరత్ మిశ్రా మరియు అతని కుటుంబం తనకు లేదా అతని బంధువులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని సుమిత్ర సోదరుడు అభయ్ తివారీ తన ఫిర్యాదులో ఆరోపించాడు. ఈ రోజు ఉదయం సుమిత్రా హత్యకు గురైన విషయం తనకు తెలిసిందని, అందుకే ముంబాయి నుంచి తాను వచ్చానని సిటీ కొత్వాలి పోలీసులు పోలీస్ ఇన్‌స్పెక్టర్ థానే విజయ్ సింగ్‌కు తెలిపారు.
సుమిత్రా మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రేవా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిశ్రా తన సోదరి సుమిత్రాను ప్రతినిత్యం కొట్టేవాడని, అదే ఆమె హత్యకు కారణమై ఉండవచ్చని ఆమె సోదరుడు అభయ్ తివారి ఆరోపించారు. హత్యకు గురైన సుమిత్ర కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో మేము కేసు నమోదు చేశామని, నిందితులపై చర్యలు తీసుకోవడానికి పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి సింగ్ చెప్పారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications