కొంపముంచిన లేడీ గెటప్..! భార్యను కలవడానికి వెళ్తే మరో షాక్

విల్లుపురం : భార్యను కలుసుకోవడానికి దొంగ వేషాలు వేయాల్సిన పరిస్థితి వచ్చింది ఓ భర్తకు. దర్జాగా అత్తగారింటికి వెళ్లాల్సినోడు.. మారు వేషం వేసుకొని ఎవరి కంటా పడకుండా భార్య దగ్గరికి వెళ్లాడు. ఆడవేషమైతే వేశాడు గానీ పాపం చెప్పులు మాత్రం ఆడవారివి వేసుకోవడం మరిచిపోయినట్టున్నాడు. దీంతో చెప్పులే అతని కొంపముంచగా, అత్తగారింటికి బయలుదేరినోడు కాస్త పోలీసు స్టేషన్ లో ప్రత్యక్షమై నవ్వుల పాలయ్యాడు.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన శేఖర్ అనే వ్యక్తికి రెండేళ్ళ క్రితం ఇంద్రా అనే అమ్మాయితో వివాహం జరిగింది. అయితే ఉద్యోగ నిమిత్తం భార్యకు దూరంగా సింగపూర్ లో ఉంటోన్న అతడు, ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇటీవలే ఇండియాకు తిరిగొచ్చేశాడు. అయితే ఉద్యోగం వదిలేయడంతో శేఖర్ పై గుర్రుగా ఉన్న అతని అత్తగారు తన కూతురిని అల్లుడి దగ్గరకు పంపించకుండా తన వద్దే ఉంచుకుంది.

A Husband Lady getup for His Wife

దీంతో భార్యకు దూరంగా ఉండలేకపోయిన శేఖర్, ఎలాగైనా ఆమెను కలవాలనుకున్నాడు. ఇందుకోసం ఆడవేషం అయితే తన అత్తగారికి అనుమానం రాదని భావించిన అతను, అదే వేషంలో భార్య ఇంటిముందు వాలిపోయాడు. అయితే అనుకున్నట్టుగానే భార్యతో మాట్లాడిన అతను తిరిగి వెళ్లేప్పుడు మాత్రం చిక్కుల్లో పడ్డాడు.

ఆడవేషంలో ఉన్న అతడు మగవారి చెప్పులు ధరించడాన్ని గుర్తించిన అక్కడి స్థానికులు, శేఖర్ ను చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్లడానికి వచ్చిన వ్యక్తిగా అనుమానించారు. ఇంకేముంది తీసుకెళ్లి పోలీసులకు అప్పగించడంతో అసలు విషయం బయటపడగానే అక్కడున్న వారంతా గొల్లుమని నవ్వందుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+