Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అందమైన భార్య, అనుమానం పిచాచి, టార్చర్, పురుగుల మందు ఇంజెక్షన్ వేసి చంపేసిన భర్త, నరాలు!

బెంగళూరు: భార్య మీద అనుమానంతో ఆమెను చిత్రహింసలకు గురి చేసిన రాక్షసుడు చివరికి ఆమెకు విషపూరిత ఇంజక్షన్ (పాయిజన్ )వేసి కిరాతకంగా హత్య చేశాడు. తన భార్య అనారోగ్యంతో మరణించిందని కుటుంబ సభ్యులు, ప్రపంచాన్ని నమ్మించడానికి ప్రయత్నించాడు. అయితే భర్త పాపం పడటంతో అతని అసలు స్వరూపం బయటపడింది. పంట పురుగులు నాశనం చెయ్యడానికి ఉపయోగించే క్రిమిసంహారక మందులతో ఇంజెక్షన్ వేసి తన భార్యను హత్య చేశానని నిందితుడు పోలీసుల ముందు అంగీరించాడు.

మంచి భార్య, మంచి ఉద్యోగం

మంచి భార్య, మంచి ఉద్యోగం

బెంగళూరు నగర శివార్లలోని రామనగరలోని హనుమంతనగరలో వడ్డెరదోడ్డి నివాసి వెంకటేష్, కోళమారనకోప్ప నివాసి దీపా (22) దంపతులు నివాసం ఉంటున్నారు. దీపా చూడటానికి చాలా అందంగా ఉంటుంది. వెంకటేష్ రామనగర ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. వివాహం అయిన మొదట్లో వెంకటేష్ భార్య దీపాతో సంతోషంగానే ఉండేవాడు.

అనుమానం పిచాచి

అనుమానం పిచాచి

ఉదయం ఉద్యోగానికి వెళ్లే వెంకటేష్ సాయంత్రం లేదా రాత్రి ఇంటికి వెళ్లేవాడు. ఇంటికి వెళ్లిన తరువాత వెంకటేష్ దీపా మీద అనుమానం పెంచుకున్నాడు. నేను బయటకు వెళ్లిన తరువాత నువ్వు ఎక్కడెక్కడికి వెలుతున్నావ్ ? ఇంటికి ఎవరెవరు వస్తున్నారు ? అంటూ భార్యను దీపాను వెధింపులకు గురి చేశాడు.

శారీరక, మానసిక హింస

శారీరక, మానసిక హింస

రోజు ఇంటికి వచ్చి భార్య దీపాకు టార్చర్ పెట్టే వెంకటేష్ ఇటీవల ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించడం మొదలు పెట్టాడు. భర్త వెంకటేష్ వేధింపులు తట్టుకోలేని దీపా ఆమె కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. పెద్దలు నచ్చచెప్పినా వెంకటేష్ ప్రవర్తనలో ఏమాత్రం మార్పురాలేదు. విసిగిపోయిన దీపా తన బతుకు ఇంతే అంటూ సైలెంట్ గా ఉండిపోయింది.

క్రిమిసంహాకర మందు

క్రిమిసంహాకర మందు

భార్యను ఎలాగైనా అంతం చెయ్యాలని వెంకటేష్ ప్లాన్ వేశాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న వెంకటేష్ కు ఇంజక్షన్ ఎలా వెయ్యాలి అనే విషయం బాగాతెలుసు. భార్య దీపాకు క్రిమిసంహారక మందు కలిపిన విషపూరిత ఇంజక్షన్ వేసి హత్య చేస్తే తనను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని వెంకటేష్ బావించాడు. అనుకున్నట్లే పర్టిలైజర్స్ షాప్ కు వెళ్లిన వెంకటేష్ పంట పురుగులు నాశనం చేసే క్రిమిసంహారక మందు ఉన్న బాటిల్ తీసుకున్నాడు.

భార్య నిద్రపోతుంటే ఇంజెక్షన్

భార్య నిద్రపోతుంటే ఇంజెక్షన్

దీపా నిద్రపోతున్న సమమంలో క్రిమిసంహారక మందు కలిపిన ఇంజక్ష్ వేశాడు. తరువాత మతిస్థిమితం కోల్పోయిన దీపా గొంతు మీద కాలువేసి హత్య చేశాడు. తరువాత దీపా శవాన్ని తీసుకెళ్లి ప్రభుత్వ ఆసుపత్రి బెడ్ మీద పడుకోబెట్టి తన భార్యకు జ్వరం వచ్చిందని, అందుకే సెలైన్ బాటిల్ ఎక్కించానని వెంకటేష్ అక్కడ ఉన్న సిబ్బందిని నమ్మించడానికి ప్రయత్నించాడు.

నరాలు తిప్పేసిన పోలీసులు

నరాలు తిప్పేసిన పోలీసులు

ఆసుపత్రి సిబ్బందికి అనుమానం వచ్చి వెంటనే రామనగర పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషపూరిత ఇంజక్షన్ వెయ్యడం వలనే దీపా మరణించిందని వైద్యులు చెప్పడంతో పోలీసులు వెంకటేష్ కు బెండ్ తీశారు. అయినా వెంకటేష్ మాత్రం నిజం అంగీకరించలేదు. పోలీసులు వెంకటేష్ నరాలు తిప్పేయడంతో క్రిమిసంహారక మందు కలిపిన ఇంజెక్షన్ వేసి తన భార్య దీపాను హత్య చేశానని అంగీకరించాడు. సంక్రాంతి పండుగ రోజే దీపా దారుణ హత్యకు గురి కావడంతో ఆమె కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+