బెడ్ రూమ్ లో భర్త ఏం చెయ్యలేకపోయాడు, అతన్ని భార్య ఎక్కడ పెట్టిందంటే ?
బెంగళూరు: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లికి ముందే ప్రేమికులు హ్యాపీగా తిరుగుతూ ఎంజాయ్ చేశారు. ప్రేమికుల పెళ్లికి పెద్దలు నిరాకరించారు. తరువాత పెద్దలను ఎదిరించిన ప్రేమికులు పెళ్లి చేసుకున్నారు. నిత్యం లిక్కర్ మత్తులో ఉన్న భర్త పీకలదాక తాగేసి వెళ్లి బెడ్ రూమ్ లో భార్యను ఏమీ చెయ్యలేక నిద్రపోయేవాడు. శారీరక సంబంధం ఇవ్వలేని భర్త తీరుతో విసిగిపోయిన భార్య అతన్ని రిహ్యాబిటేషన్ సెంటర్ లో చేర్పించడంతో కథ మొత్తం రివర్స్ అయ్యింది.
బెంగళూరులోని బాణసవాడిలో దివాకర్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. బాణసవాడి సమీపంలో నిఖితా అనే యువతి నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితం దివాకర్, నిఖితాకు పరిచయం అయ్యింది. రానురాను దివాకర్, నిఖితాల స్నేహం ప్రేమగా మారింది. ప్రేమికులు అందరిలాగే నిఖితా, దివాకర్ పెళ్లికి ముందే హ్యాపీగా తిరుగుతూ ఎంజాయ్ చేశారు.

ప్రేమికులు దివాకర్, నిఖితాల పెళ్లికి పెద్దలు నిరాకరించారు. తరువాత పెద్దలను ఎదిరించిన ప్రేమికులు నిఖితా, దివాకర్ పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందే దివాకర్ కు మద్యం సేవించే అలవాటు ఉంది. లవ్ మ్యారేజ్ చేసుకున్న తరువాత దివాకర్ కు మద్యం సేవించే అలవాటు ఇంకా ఎక్కువ అయ్యింది. భర్త దివాకర్ తో మద్యం మాన్పించాలని అతని భార్య నిఖితా అనేక ప్రయత్నాలు చేసింది.
నిత్యం రాత్రి లిక్కర్ మత్తులో ఉంటున్న దివాకర్ ఇంటికి వెళ్లి అతని భార్యతో గొడవ చేసేవాడని తెలిసింది. పీకలదాక తాగేసి ఇంటికి వెలుతున్న దివాకర్ రాత్రి బెడ్ రూమ్ లో అతని భార్య నిఖితాకు పడక సుఖం ఇవ్వలేక, మద్యం మత్తులో రొమాన్స్ చెయ్యలేక నిద్రపోయేవాడు. చాలాకాలం పాటు దివాకర్ ఇలాగే చెయ్యడంతో అతని భార్య నిఖితా విసిగిపోయిందని తెలిసింది.

స్నేహితులు, కొందరు బంధువులు నిఖితా గురించి తెలుసుకుని విచారం వ్యక్తం చేశారు. ఎన్నో ఆశలతో లవ్ మ్యారేజ్ చేసుకున్న భర్త దివాకర్ తాగుడుకు బానిస కావడంతో, రోజు రాత్రి ఇంట్లో గొడవ చెయ్యడంతో నిఖితా ఆవేదన చెందిందని తెలిసింది. స్నేహితుల సలహాతో నిఖితా ఆమె భర్త దివాకర్ ను బెంగళూరులోని ఓ రిహ్యాబిటేషన్ సెంటర్ లో చేర్పించింది. తన భర్త దివాకర్ మద్యం మాట ఎత్తకుండా చెయ్యాలని నిఖితా అనుకుంది.
తనను రిహ్యాబిటేషన్ సెంటర్ లో చేర్పించిన తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో తిరుగుతోందని భర్త దివాకర్ కు అనుమానం మొదలైయ్యింది. కొన్ని నెలల తరువాత ఇటీవలే దివాకర్ రిహ్యాబిటేషన్ సెంటర్ నుంచి బయటకు వచ్చాడు. తరువాత భార్య నిఖితాకు అనుమానం రాకుండా ఆమెను దివాకర్ ఫాలో అయ్యాడు.
భార్య నిఖితాకు అక్రమ సంబంధం ఉందని నిర్దారించుకున్న దివాకర్ ఆమెను చంపేయాలని డిసైడ్ అయ్యాడు. స్నేహితుడితో కలిసి యాక్టీవ్ స్కూటర్ లో దివాకర్ అతని భార్య నిఖితాను పిలుచుకుని బయలుదేరాడు. ఆక్టీవాలో ముగ్గురు కలిసి వెలుతున్న సమయంలో బాణసవాడిలోని ఓ రోడ్డులో బైక్ ను స్కూటర్ డీకొట్టినట్లు నాటకం ఆడారు.

ఆ సందర్బంలో ఆక్టీవాలో కుర్చున్న నిఖితా కిందపడిపోయింది. కిందపడిపోయిన భార్య నిఖితాను దివాకర్ కత్తితో ఇష్టం వచ్చినట్లు పొడిచేశాడు. భార్య నిఖితాను కత్తితో దారుణంగా పొడిచిన దివాకర్ అతని స్నేహితుడి స్కూట్ మీద అక్కడి నుంచి పరారైనాడు, స్తానికులు నిఖితాను రక్షించి ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు దివాకర్ ను, అతని స్నేహితుడిని అరెస్టు చేశారు.
ఈ కేసులో ఇంకా కొందరి ప్రమేయం ఉందని, వారి కోసం గాలిస్తున్నామని బాణసవాడి పోలీసులు తెలిపారు. దివాకర్ అతని భార్యను కత్తితో ఇష్టం వచ్చినట్లు పొడిచే సమయంలో పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో ఆ క్లిప్పింగ్స్ ను స్వాధీనం చేసుకున్న బాణసవాడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications