జూదంలో భార్యను పందెంగా పెట్టిన భర్త...
ఓ వ్యక్తి జూదంలో భార్యను పందెంగా పెట్టాడు. ఇలాంటి సంఘటనలను మనం పురాణాల్లో చూసి ఉంటాం. మహాభారత కథల్లో విని ఉంటాం. కానీ, ఈ ఆధునిక యుగంలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో
చోటుచేసుకుంది.
అన్ని వ్యసనాలు ఉన్న భర్త : ఉత్తరప్రదేశ్‌లోని దిదోలి కొత్వాలి ప్రాంతానికి చెందిన ఓ యువతికి దేహాత్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నయువకుడితో వివాహం జరిగింది. వారి వివాహానికి మూడేళ్లు నిండాయి. అయితే ఈ మూడేళ్లలో ఆ యువతి పడిన బాధలు అన్నీ ఇన్నీ కావు. ఈ మూడేళ్లు ఆమె ఒక నరకంలో ఉన్నట్లే, ఓ వైపు అన్ని వ్యసనాలు ఉన్న భర్త. మరోవైపు అత్తమామల వేధింపులు, లైంగికంగా వేధించే మరిది ఇన్నీ సమస్యలు మధ్య ఆమె కొట్టుమిట్టాడుతుంది. ఆమె భర్త పేకాటకు బానిసయ్యాడు. దానికోసం ప్రతిరోజూ ఆమెను డబ్బులు తీసుకురమ్మని వేధించేవాడు. పేకాటకు బానిసైన భర్త ఓ రోజు ఆమెను 15 లక్షల రూపాయలు తేవాలని వేధించాడు.

ఢిల్లీలో భార్యను వదిలేసిన వచ్చిన ఘనుడు : అయితే, అడిగిన డబ్బు భార్య తీసుకురాకపోయేసరికి ఓ రోజు భార్యను నమ్మించి ఢిల్లీకి తీసుకెళ్లాడు భర్త. అక్కడ జూదం ఆడి ఓడిపోయాడు. డబ్బులు కట్టలేని పరిస్థితిలో భార్యను అక్కడ వదిలేసి వచ్చాడు ఆ ఘనుడు. దీంతో ఆమెకు ఏం చేయాలో అర్థంకాక నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. అయితే సోదరి విషయం తెలుసుకున్న ఆమె సోదరుడు ఢిల్లీ వెళ్లి వాళ్లకు ఇవ్వాల్సిన సొమ్మును ఇచ్చేసి సోదరిని విడిపించుకుని వచ్చాడు. మళ్లీ ఆమెను ఆ నరకంలోనే వదిలేసి వచ్చాడు. కానీ, అత్తింటి వారు ఆమెను ఆహ్వనించలేదు. నువ్వు వేరేవాళ్లతో కలిసి ఉన్నావు.. మా ఇంట్లోకి రావడానికి వీల్లేదంటూ ఆమెను కొట్టి ఇంట్లోంచి గెంటేశారు.
లైంగికంగా వేధించిన మరిది : ఒంటరిగా ఉన్న ఆమె మీద మరిది కన్నేసాడు. ఆమెను లైంగిక లోబరుచుకోవాలనుకున్నాడు. ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. దానికి ఆమె ఎదురు తిరిగింది. దాంతో మరిది ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వీటన్నింటిని భరించలేకు ఆమె ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె భర్తతో పాటు తొమ్మిదిమందిపై వరకట్న వేధింపులు,గృహ హింస, దాడి వంటి క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగింది.












Click it and Unblock the Notifications