Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బెడ్ రూమ్ లో భార్యను వదిలేశాడు, ఆంటీ కోసం ఆరాటపడ్డాడు, క్లైమాక్స్ లో మాత్రం !

బెంగళూరు/తుమకూరు: వివాహం చేసుకుంటే యువతి, యువకుడు సంతోషంగా ఉంటాడని ఇరువైపుల కుటుంబ సభ్యులు అనుకున్నారు. పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టం అని యువతి, యువకుడు చెప్పారు. పెళ్లి కూడా గ్రాండ్ గా జరిగింది. పెళ్లికి ఇరు వైపుల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ఇరు వైపుల ఊర్లలోని వాళ్లు హాజరైనారు. అయితే అక్రమ సంబంధం కారణంగా ఆ దంపతుల జీవితం నాశనం అయ్యింది.

కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని కోరగెరె తాలుకాలోని నరసీపుర గ్రామంలో సోమశేఖర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కోరగెరెకి చెందిన కళావతి (26) అనే యువతిని సోమశేఖర్ కు ఇచ్చి పెళ్లి చెయ్యాలని పెద్దలు మాట్లాడుకున్నారు. కళావతిని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని సోమశేఖర్ చెప్పాడు. సోమశేఖర్ ను పెళ్లి చేసుకోవడం తనకు కూడా ఇష్టమే అని కళావతి కూడా చెప్పింది.

A husband who does not care if his wife commits suicide due to an illicit relationship near Tumakuru
యువతి, యువకుడు పెళ్లి చేసుకోవడానికి అంగీకరించడంతో కళావతి, సోమశేఖర్ ల పెళ్లి గ్రాండ్ గా జరిగింది. వివాహం చేసుకున్న తరువాత కళావతి ఆమె భర్త సోమశేఖర్ ఇంటికి వెళ్లి కాపురం చేస్తోంది. మొదట భార్య కళావతితో చక్కగా కాపురం చేసిన సోమశేఖర్ రానురాను అతని భార్యకు దూరంగా ఉండటం మొదలుపెట్టాడు.

ఏదో టెన్షల్ లో ఉండాడని కళావతి కూడా మొదట్లో ఆమె భర్త సోమశేఖర్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే భర్త సోమశేఖర్ లో మార్పు రాకపోవడంతో అతని భార్య కళావతి మ్యాటర్ బయటకులాగింది. సోమశేఖర్ పెళ్లికి ముందు నుంచి ఓ ఆంటీతో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడని తెలుసుకున్న అతని భార్య కళావతి హడలిపోయింది.

ఇదే విషయంలో సోమశేఖర్, కళావతి దంపతుల మధ్య గొడవలకు దారితీసింది. రానురాను దంపతుల మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయి. నేను ఆంటీకి వదులుకోనని, కావాలంటే నిన్ను వదులుకుంటానని సోమశేఖర్ అతని భార్య కళావతికి తేల్చి చెప్పాడు. ఇదే సమయంలో భార్య కళావతి అనుమానాస్పదస్థితిలో ఇంటిలో శవమై కనిపించింది.

A husband who does not care if his wife commits suicide due to an illicit relationship near Tumakuru

విషయం తెలుసుకున్న కళావతి కుటుంబ సభ్యులు ఆమె భర్త సోమశేఖర్ మీద కేసు పెట్టారు. భర్త సోమశేఖర్ అతని భార్య కళావతిని హత్య చేసి దానిని ఆత్మహత్యగా చిత్రీకరించాడని కళావతి కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కళావతి అంత్యక్రియలకు కూడా ఆమె భర్త సోమశేఖర్ హాజరుకాకపోవడంతో అందరూ హడలిపోయారు.

అక్రమ సంబంధానికి భార్య కళావతి అడ్డుపడుతోందని ఆమెను భర్త సోమశేఖర్ హత్య చేసి ఉంటాడని కేసు నమోదు అయ్యిందని, సోమశేఖర్ తో పాటు అతని ప్రియురాలు కూడా మాయం అయ్యిందని, కేసు విచారణలో ఉందని తుమకూరు పోలీసులు తెలిపారు. భార్య అనుమానాస్పదస్థితిలో చనిపోయినా ఆమె భర్త అంత్యక్రియలకు హాజరుకాకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+