భర్త ఫ్రెండ్ తో భార్య ?, అర్దరాత్రి అంతా అయిపోయింది, కుక్కల ముందు శవాన్ని విసిరేసి ?
బెంగళూరు/పాట్నా: వివాహం చేసుకున్న దంపతులు కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహం జరిగిన తరువాత చాలా కాలం సొంత ఊర్లో ఉన్న దంపతులు తరువాత బతుకుదెరువు కోసం సిటీకి (city) వెళ్లారు. అక్కడ భార్య ప్రియుడిని సెట్ చేసుకుని ఎంజాయ్ చేసింది. భార్యతో (wife) కలిసి ఆమె ప్రియుడిని భర్త (husband) హత్య చేసి శవాన్ని కుక్కల ముందు విసిరేయడం కలకలం రేపింది.
గతంలో వదిలేసిన ప్రియుడు తరువాత కూడా అక్రమ సంబంధాన్ని కొనసాగించాలంటూ వేధించడంతో అతన్ని హత్య చేసిన కేసులో దంపతులను బెంగళూరులోని (bengaluru) మహాలక్ష్మి లేఅవుట్ పోలీసులు అరెస్ట్ చేశారు.బీహార్‌కు చెందిన రాజేష్ కుమార్ (34), అతని భార్య నేహా కుమారి (kumari) అలియాస్ నేహా (21) అనే మహిళను అరెస్టు చేశారు.

నిందితులు ఈనెల 15వ తేదీ రాత్రి బీహార్‌కు (Bihar)చెందిన సజ్జన్ సింగ్ (33)ని గొంతుకోసి హత్య చేసి మృతదేహాన్ని సోమేశ్వరనగర్‌లోని ఓ సందులో కుక్కల ముందు పడేశారని పోలీసులు అన్నారు. బాధితుడి కుటుంబ సభ్యుల (family) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి హత్య చేసిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని బెంగళూరు సిటీ పోలీసు అధికారులు తెలిపారు.
హత్యకు గురైన సజ్జన్ సింగ్, నిందితులైన దంపతులు రాజేష్ కుమార్, నేహా కుమారి ముగ్గురూ బీహార్‌కు చెందినవారు. కొన్నేళ్ల క్రితం బీహార్ లో పని చెయ్యడానికి ఉద్యోగం దొరక్క బెంగళూరు (Bengaluru) వచ్చి ఆర్‌ఎంసీ యార్డులో వీరు పనిచేస్తున్నారు. నిందితురాలు నేహా కుమారి ఆమె భర్త రాజేష్ కుమార్ తో కాపురం చేస్తోంది. భర్త (husband) రాజేష్ కుమార్ కోసం ఇంటికి వచ్చి వెలుతున్న సజ్జన్ సింగ్‌లకు, నేహా కుమారికి పరిచయం ఏర్పడింది.
రానురాను నేహా కుమారి, సజ్జన్ సింగ్ ల పరిచయం సన్నిహితంగా మారి తరువాత అక్రమ సంబంధానికి దారితీసింది. చాలాకాలం పాటు భర్త (husband) రాజేష్ ఇంట్లో లేని సమయంలో బాయ్ ఫ్రెండ్ సజ్జన్ సింగ్ ను ఇంటికి పిలిపించుకుంటున్న నేహా కుమారి ఆమె ప్రియుడితో పిచ్చపాటిగా ఎంజాయ్ (bedroom) చేసింది. చాలా కాలం నేహా కుమారి (Kumari), సజ్జన్ సింగ్ ల అక్రమ సంబంధం సాఫీగా సాగిపోయింది.

కొంతకాలం క్రితం భార్య (wife) నేహా కుమారి అక్రమ సంబందం గురించి తెలుసుకున్న రాజేష్ (husband) ఇద్దరినీ హెచ్చరించాడు. భర్త రాజేష్ సలహాతో మేల్కొన్న నేహా కొంకాలం పాటు ఆమె ప్రియుడు సజ్జన్ సింగ్ ను దూరం చేసింది. అయితే సజ్జన్ సింగ్ తనతో అనైతిక సంబంధాన్ని కొనసాగించాలని నేహాను వేధించడం ప్రారంభించాడు. అతడి గొడవతో విసిగిపోయిన నేహా ఈ విషయాన్ని ఆమె భర్త రాజేష్‌కు తెలియజేసింది.
దీంతో కోపోద్రిక్తుడైన రాజేష్ అతని భార్య నేహా ప్రియుడు సజ్జన్ సింగ్‌ను హత్య చేసేందుకు పథకం పన్నాడు. రాత్రి భార్య నేహాతో సజ్జన్ సింగ్ కు ఫోన్ చేయించిన రాజేష్ అతన్ని ఇంటికి పిలిపించుకున్నాడు. తరువాత రాజేష్ అతని భార్య నేహా ప్రియుడు (boyfriend) సజ్జన్ సింగ్ తో గొడవపెట్టుకున్నాడు. మర్యాదగా నా భార్య నేహాకు దూరంగా ఉండాలని, లేదంటే చంపేస్తానని హెచ్చరించాడు.
తరువాత రాజేష్, సజ్జన్ సింగ్ ల మధ్య గొడవ జరిగింది. ఈనెల 15వ తేదీన రాత్రి సోమేశ్వరనగర్‌లో ఆగ్రహించిన రాజేష్ అతని భార్య ప్రియుడు (boyfriend)సజ్జన్ సింగ్‌ను కత్తితో గొంతు కోసి హత్య (murder) చేశాడు. అనంతరం రాజేష్, నేహా దంపతుల సజ్జన్ సింగ్ మృతదేహాన్ని ఓ సందులో పడేసి అక్కడికి కుక్కలను తోలి పరారయ్యారు. 16వ తేదీ ఉదయం మహాలక్ష్మి లేఔట్ లో మృతదేహాన్ని గుర్తించిన ప్రజలు ఇచ్చిన సమాచారంతో బెంగళూరు (Bengaluru) పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో అసలు మ్యాటర్ బయటకు వచ్చింది.












Click it and Unblock the Notifications