బీ అవేర్ ఆఫ్ కిస్ : లిప్‌లాక్ కిస్‌తో అనర్థాలే...! సెక్సే శ్రేయస్కరం అంటోన్న స్టడీ

ముద్దు... ఇంగ్లీషులో కిస్.. ఈ కిస్ థియరీపై ఎంతో మంది సినీ కవులు వారిదైన శైలిలో సినీ గేయాలు రాశారు. ఆ పాటలు వినటానికి బాగానే ఉంటాయి. కానీ ఆపాటల్లో చెప్పినట్లు ఆచరించామా ఇక అంతే సంగతులు. లేనిపోని సుఖవ్యాధుల కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. అందుకే ముద్దు పెట్టే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ముద్దులు పలు రకాలుగా ఉంటాయి. ఒక్కసారి లిప్‌లాక్ కిస్ పెట్టామో మనకు తెలియకుండానే మనలను ఓ వ్యాధి వెంటాడుతుంది.

 ముద్దు పెట్టామా ముప్పుకు గురయ్యామే..!

ముద్దు పెట్టామా ముప్పుకు గురయ్యామే..!

ఈ మధ్యకాలంలో ముద్దు అనే కాన్సెప్ట్ లేకుండా ఇద్దరు ప్రేమికులు ఉండలేరు. ప్రేమలో పడ్డాక ముద్దుతోనే రొమాన్స్ బిగిన్ అవుతుంది. పాపం ఆ ప్రేమికులకు తెలియదు ముద్దుతో ఎంత ప్రమాదం పొంచి ఉందో అన్న విషయం. ఈ మధ్యకాలంలో చాలామందిలో గొనోరియా అనే వ్యాధి బయటపడింది.అది చాలా వేగంగా వ్యాప్తి చెందింది. అసలు ఏంటీ వ్యాధి... ఎలా వస్తుందో అనే అంశంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. పరిశోధనల్లో తేలిందేమిటంటే ఒక వ్యక్తిని మరో వ్యక్తి ముద్దుపెట్టడం వల్లే వచ్చిందనే విషయం బయటపడింది. అది కూడా లిప్ లాక్ వల్లే ఈ వ్యాధి వచ్చిందన్న సంగతిని బయటపెట్టారు పరిశోధకులు. ఇది లైంగిక కలయికల వల్ల వచ్చే వ్యాధికంటే యమ డేంజర్ అని తేల్చేశారు.

ముద్దుతో వచ్చే గొనోరియా వ్యాధి

ముద్దుతో వచ్చే గొనోరియా వ్యాధి

ఇక ముద్దుతో తెలియకుండానే ఓ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుందని పరిశోధకులు వెల్లడించారు. ఈ విషయాన్ని ది లాన్సెట్ అనే జర్నల్‌లో పబ్లిష్ చేశారు. ఒకరి నొకరు లిప్‌లాక్ చేసుకోవడం వల్ల గొనోరియా వ్యాధి అతి వేగంగా వ్యాప్తి చెందుతోందన్న విషయాన్ని గ్లోబల్ సెక్సువల్ హెల్త్ కమ్యూనిటీ గుర్తించాలని మోనాష్ యూనివర్శిటీ ప్రొఫెసర్ కిట్ ఫెయిర్లీ హెచ్చరిస్తున్నారు. ముద్దు ముఖ్యంగా లిప్‌లాక్ కిస్‌లతో వచ్చే వ్యాధి గురించి వీలైనంత తర్వగా అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అయితే ఎంత వేగంగా ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుందో అంతే వేగంగా ఈ డెడ్లీ వ్యాధి గురించి అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని హెచ్చిరించారు. అంతే వేగంతో కూడా భాగస్వామితో ముద్దులను నియంత్రిచేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇక రతీ క్రీడ సమయంలో ముద్దులను మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోతే ఆరోగ్యపరంగా నష్టం చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.

శృంగారం సమయంలో ముద్దుపెట్టే వారిలోనే వ్యాధి అధికం

శృంగారం సమయంలో ముద్దుపెట్టే వారిలోనే వ్యాధి అధికం

ఇక ముద్దు వల్ల వచ్చిన గొనోరియా వ్యాధిని నిర్థారించేందుకు పరిశోధకులు పరిశోధనలు జరిపారు. ఇందుకోసం 3600 మంది పురుషుల శాంపిల్స్‌ను తీసుకున్నారు. వీరంతా ప్రతి నెలా మహిళలతో లైంగికంగా కలిసేవారే అని స్పష్టం చేశారు. ఈ 3600మంది పురుషుల్లో కేవలం ముద్దులతో సరిపెట్టే వారిని సెపరేటుగా గుర్తించారు. లైంగికంగా కలిసిన వారిని సెపరేటుగా గుర్తించారు. ఇక కేవలం ముద్దులతోనే పని ముగించిన వారిలో గొనోరియా వ్యాధి సోకినట్లు గుర్తించారు. లైంగికంగా కలిసి ముద్దుల్లో మునిగి తేలిన వారిలో గొనోరియా వ్యాధి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇక కేవలం శృంగారం వరకే పరిమితమైన వారిలో గొనోరియా వ్యాధి లేదని గుర్తించారు. ఇక దీన్ని కొంతవరకు నియంత్రించాలంటే యాంటీ బ్యాక్టీరియల్ మౌత్‌వాష్‌ను వినియోగించడం తప్పనిసరి అని ప్రొఫెసర్ కిట్ ఫెయిర్లీ చెప్పారు.

మొత్తానికి పరిశోధకులు ముద్దుతో వచ్చే జబ్బులను బయటపెట్టడంతో కిస్ అంటే కిలోమీటర్ దూరానికి పారిపోతున్నారు. పది నిమిషాల సుఖం కోసం జీవితాంతం లేని పోని వ్యాధులు తెచ్చుకోలేము కదా అనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. సో... బీ అవేర్ ఆఫ్ కిస్సెస్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+