పెళ్లి ఫిక్స్, ఆసుపత్రి నుంచి వెళ్లిన లేడీ డాక్టర్ కు ఏమైయ్యింది ?, ఇంట్లో శవం !

బెంగళూరు/చామరాజనగర్: కర్ణాటకలోని చామరాజనగర జిల్లాలోని కోళ్లేగాళ పట్టణంలోని ప్రభుత్వ సబ్‌ డివిజన్‌ ​​ఆసుపత్రిలో పని చేస్తున్న లేడీ డాక్టర్ (doctor) అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. ఈ సంఘటన మహదేశ్వర కళాశాల రోడ్డులోని ఓ ఇంట్లో చోటుచేసుకుంది.

డాక్టర్ సింధూజ(28) దురదృష్టవశాత్తు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తమిళనాడుకు (Chennai) చెందిన సింధూజ ఎంబీబీఎస్( MBBS) పూర్తి చేసిన తర్వాత తదుపరి చదువులు పీజీ (MS) చదవడానికి చామరాజనగర జిల్లాకు వెళ్లింది.

 A lady doctor

పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో భాగంగా కొళ్లేగాళ ప్రభుత్వ ఆసుపత్రి సబ్ డివిజన్‌లో ఆసుపత్రిలో అనస్థీషియాలజిస్ట్‌గా సింధూజ పనిచేస్తోంది. లేడీ డాక్టర్ (doctor) సింధూజకు హాస్పిటల్‌లోని సిబ్బంది అందరితో మంచి అనుబంధం ఉంది. సింధూజకు ఎవరితోనూ గొడవలు లేవు. ఎప్పటిలాగే గురువారం డ్యూటీ ముగించుకుని మహదేశ్వర్ కాలేజీ రోడ్డులోని నివాసం (residence)ఉంటున్న అద్దె ఇంటికి డాక్టర్ (doctor) సింధూజ చేరుకుంది.

అయితే శుక్రవారం సింధూజ ఆసుపత్రిలో విధులకు హాజరు కాలేదు. ఆస్పత్రి సిబ్బంది డ్యూటీకి రాని సింధూజకు అక్కడి సిబ్బంది ఫోన్ చేశారు. ఈ సమయంలో లేడీ డాక్టర్ (doctor) సింధూజ కాల్ రిసీవ్ చెయ్యలేదు. దీంతో ఆస్పత్రి సిబ్బందికి అనుమానం వచ్చి సింధూజ నివాసం ఉంటున్న ఇంటికి (residence) వెళ్లారు. తలుపు తట్టినా లేడీ డాక్టరక సింధూజ తలుపులు తెరవలేదు.

ఆసుపత్రి సిబ్బంది కిటికీ అద్దాలు పగలగొట్టడంతో ఆమె ఇంటి నేల మీద శవమై కనిపించడంతో ఆమె ఆత్మహత్య విషయం వెలుగులోకి వచ్చింది.

సింధూజ నేలపై శవమై పడి ఉండటంతో అందరూ షాక్ అయ్యారని పోలీసులు అన్నారు. సింధూజ మృతదేహం దగ్గర సిరంజి (doctor) కనిపించిందని పోలీసులు అన్నారు.

వచ్చే ఏడాది జనవరి 2వ తేదీన డాక్టర్ సింధూజ పెళ్లి జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పెళ్లి ఇష్టం లేకపోవడంతో లేడీ డాక్టర్ (doctor) సింధూజ ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందా? లేక ఆమెను ఎవరైనా హత్య చేశారా? అంటూ కోళ్లేగాళ పట్టణ పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి (Tamil Nadu)ఆధారాలు సేకరించి తనిఖీ చేస్తున్నారు.

 A lady doctor

అయితే త్వరలో పెళ్లిపీటలు ఎక్కాల్సిన లేడీ డాక్టర్ (doctor) సింధూజ ఆమె నివాసం ఉంటున్న ఇంటిలోనే అనుమానాస్పదంగా శవమై కనిపించడంతో సాటి డాక్టర్లతో పాటు ఆమె స్నేహితులు షాక్ అయ్యారు. లేడీ డాక్టర్ సింధూజ (Mysuru) మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు దానిని పరిశీలిస్తున్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+