Woman with Placard: వరుడి వెతుకులాటలో రోడ్డెక్కిన ఇన్‌ఫ్లూయెన్సర్.. ప్లకార్డు చేతితో పట్టుకుని మరీ..

Social Media influencer: గత కొంతకాలంగా భారత్‌లో వధూవరుల విషయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమకు తగిన వరుడు లేదా వధువును గుర్తించేందుకు వివిధ మ్యారేజ్ బ్యూరోలు, మధ్యవర్తులను కలవాల్సి వస్తోంది. ఏళ్ల తరబడి తిరిగితే కానీ బిడ్డలకు పెళ్లి చేయలేకపోతున్నామని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ చేసిన పని నెట్టింట వైరల్‌ అవుతోంది.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ అయిన సయాలీ సావంత్ వరుడి కోసం వెతుకులాటలో భాగంగా రోడ్డెక్కారు. ఆమెకు దాదాపు 78 వేల మంది ఫాలోవర్లు ఉండటం విశేషం. ఆమె ముంబైలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం తాజ్ హోటల్ ముందు ఓ ప్లకార్డుతో దర్శనమిచ్చారు. తన ఫోటోతో కూడిన వివరాలు అందులో పొందుపరిచి, వరుడి కోసం వెతుకుతున్నట్లు పేర్కొంది. కాబోయే భర్త కోసం ఓ షరతు కూడా విధించింది. తనకంటే అతడు పొడవుగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పింది.

A lady social Media influencer came on to roads in search of groom

ఈ అసాధారణమైన చర్య అక్కడ పలువురి దృష్టిని ఆకర్షించింది. చాలా మంది ఆమెతో సెల్ఫీలు తీసుకోవడం, ఫొటోలు తీయడం సహా రీల్స్ చేయడం ప్రారంభించారు. మరికొంతమంది పురుషులు పాజిటివ్‌గా స్పందించి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు కూడా. 'ముల్గా రెడీ అహే అమ్చా (ఒక అబ్బాయి మాకోసం సిద్ధంగా ఉన్నాడు) అంటూ స్నేహితుల బృందం సరదాగా టీజ్ చేసింది.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట రచ్చ చేస్తోంది. ఇప్పటి వరకు 14 వేలకు పైగా లైక్‌లు రావడంతో పాటు కామెంట్ల వర్షం కురుస్తోంది. చాలా మంది సావంత్ సాహసోపేతమైన విధానాన్ని మెచ్చుకుంటూ డేరింగ్ సయాలీ హ్యాట్ ఆఫ్, సయాలీ నువ్వు గ్రేట్ అని పోస్టులు పెడుతున్నారు. మరికొందరు తమ గ్రామంలో ఓ అబ్బాయి పెళ్లికోసం వేచి చూస్తున్నాడంటూ కామెంట్స్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+