ఘోరం : టీచర్ ప్రేమించలేదని.. ఎంతకి తెగించాడంటే
చెన్నై : ఓ మహిళా టీచర్ తన ప్రేమను తిరస్కరిస్తుండడంతో.. తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన ఓ కర్కష ప్రేమికుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. అత్యంత కిరాతకంగా ఆమెపై దాడికి తెగబడడంతో.. మహిళా టీచర్ తన ప్రాణాలను కోల్పోయింది.
తమిళనాడులో తూత్తుకూడిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకోగా.. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి పరుగులు పెట్టారు. అప్పటికే నిందితుడు పరారవగా.. ప్రస్తుతం అతడికోసం ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రేమోన్మాది దాడిలో మరణించిన మహిళా టీచర్ కు వచ్చే నెలలో వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాల్సిన బిడ్డ కాస్త ఇలా ప్రేమోన్మాది ఘాతుకానికి బలవడంతో.. మృతురాలి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.












Click it and Unblock the Notifications