మాజీ బాయ్ ఫ్రెండ్ టార్చర్, పెళ్లిపీటలు ఎక్కాల్సిన లేడీ టీచర్ ఏం చేసిందంటే ?
బాగా చదువుతున్న యువతి ప్రభుత్వ ఉద్యోగం సంపాధించి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని అనుకుంది. వ్యవసాయం చేస్తున్న తండ్రికి సహాయంగా ఉండాలని అనుకున్న యువతి స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేస్తున్నది. లేడీ టీచర్ కు ఇప్పటికే నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం చేసుకున్న యువతికి పక్కింటోడి టార్చర్ ఎక్కువ పెట్టాడు. మాజీ బాయ్ ఫ్రెండ్ దెబ్బకు లేడీ టీచర్ శవం అయ్యింది.
పొరుగు ఇంటిలో నివాసం ఉంటున్న మాజీ బాయ్ ఫ్రెండ్ వేధింపులు తాళలేక ఉపాధ్యాయురాలు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్ణాటకలోని మైసూరు జిల్లా పిరియాపట్టణ తాలూకాలోని నందిపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. నందిపూర్ గ్రామానికి చెందిన హాలయ్య రెండో కుమార్తె రూపా(26) అనే టీచర్ ఆత్మహత్యకు పాల్పడిందని మైసూరు జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.

రావండూరు గ్రామంలోని కేపీఎస్ స్కూల్‌లో రూపా టీచర్ గా ఉద్యోగం చేస్తున్నది. ఎంఏ, బీఈడీ చదివిన రూపా ప్రభుత్వ టీచర్ ఉద్యోగం చెయ్యాలని పోటీ పరీక్షలు రాయడానికి శిక్షణ తీసుకుంటూ కేపీఎస్ స్కూల్ లో గెస్ట్ టీచర్‌గా పనిచేస్తోంది. కొద్ది రోజుల క్రితం నందిపూర్ గ్రామంలో నివాసం ఉంటున్న కార్తీక్ అనే వ్యక్తి టీచర్ రూపాను నేను నీకు అడిగిప్పుడు అంతా డబ్బులు ఇచ్చాను, నా డబ్బు తీసుకుని ఇంతకాలం నాతో తిరుగుతూ ఎంజాయ్ చేసిన నువ్వు నన్ను మాత్రమే ప్రేమించాలని, నన్నే పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడని తెలిసింది.
అయితే కార్తీక్ తో ఇంతకాలం క్లోజ్ గా ఉంటున్న రూపా అతను చెప్పిన చోటకు వెళ్లలేక ఇబ్బంది పడుతోందని తెలిసింది. ఇదే విషయంలో కార్తీక్ నిత్యం రూపాను టార్చర్ పెడుతున్నాడని తెలిసింది. కార్తీక్ లేడీ టీచర్ రూపాను తరచు వేధిస్తూ ఆమెను మానసికంగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. మధ్యాహ్నం 1. 30 గంటలకు నేను, నా మొదటి కూతురు రేఖా పొలానికి వెళ్లామని హాలయ్య అంటున్నాడు.

ఎప్పటిలాగే మేము బయటకే వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న రూపా తమను బయటకు సంతోషంగా పంపించిందని హాలయ్య పోలీసులకు చెప్పాడు. సాయంత్రం మేము ఇంటికి వెళ్లి చూసే సరికి వంటగది వెనుక ఉన్న రూమ్ లో రూపా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని హాలయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. హాలయకు నలుగురు పిల్లలు ఉన్నారు.
ఇప్పటికే మొదటి కూతురికి పెళ్లి అయ్యింది. హాలయ్య రెండో కుమార్తె రూపాకు కొన్ని నెలల క్రితం కూణసూరు గ్రామానికి చెందిన యువకుడితో నిశ్చితార్థం జరిగింది. ఫిబ్రవరి నెలలో రూపా పెళ్లి జరగాల్సి ఉంది. అయితే ఇలాంటి సమయంలో కాబోయే పెళ్లికూతురు రూపా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు శవపరీక్ష నిర్వహించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications