ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు, చోరీ కేసులో పొలిటికల్ లీడర్ అరెస్టు, వేల ఓట్లు వచ్చినా ?
రాజకీయాల్లో ఉంటున్న వ్యక్తులు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీ టిక్కెట్ మీద పోటీ చెయ్యడానికి దాదాపు అందరూ అన్ని ప్రయత్నాలు చేస్తారు. పంచాయితీ, గ్రామ పంచాయితీ, జిల్లా పరిషత్, ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చెయ్యాలని రాజకీయ నాయకులు తహతహలాడుతుంటారు. ఎవరి స్థాయిని బట్టి వాళ్లు ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి ప్రయత్నిస్తారు.
ఎన్నికల్లో పోటీ చెయ్యడం అంటే ఇప్పుడు కోట్లాది రూపాయలు ఖర్చు చెయ్యాల్సి వస్తుంది. వార్డు మెంబర్ గా పోటీ చెయ్యాలన్నా లక్షలాది రూపాయలు ఖర్చు చెయ్యాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్క ఓటుకు వెయ్యి రూపాయల నుంచి పది వేల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఓ వ్యక్తి ఇప్పుడు దొంగగా మారిపోయి చోరీ కేసులో అరెస్టు కావడం కలకలం రేపుతోంది.

కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా మొలకాల్మూరు తాలూకా రాయపుర గ్రామ సమీపంలో బార్ లో జరిగిన చోరీ కేసులో ఇప్పుడు ట్విస్ట్ వెలుగు చూసింది. గత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి స్వయంగా ఈ చోరీ చేశాడని వెలుగులోకి వచ్చింది. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి వెనుక ఓ ముఠా ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది.
రెండు నెలల క్రితం చిత్రదుర్గ జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని ఓ బార్‌లో డబ్బులు, మద్యం దొంగిలించి పరారయ్యారు.
బార్‌లో చోరీకి పాల్పడుతున్న దృశ్యం సీసీటీవీలో రికార్డు అయ్యింది. నిందితులను అరెస్టు చెయ్యాలని పోలీసులు గాలించారు.
అయితే అంతకు ముందే చిక్కమగళూరులో ఓ కేసులో పోలీసులు ఆ నిందితులను అరెస్టు చేశారు. చిక్కమగళూరు జైలులో ఉన్న ముగ్గురు నిందితుల బాడీ వారెంట్ మీద చిత్రదుర్గా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చిక్కమగళూరుకు చెందిన రఘుకుమార్, హాసన్‌కు చెందిన దర్శన్, జగదీష్‌లను అరెస్టు చేశారు.
నిందితులు చాలా ఏళ్లుగా చిత్రదుర్గ, దావణగెరె, తుమకూరు, చిక్కమగళూరు జిల్లాల్లో దొంగతనాలు, చోరీలు, లూటీలతో పాటు ఇతర నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు అంటున్నారు.
గత లోక్‌సభ ఎన్నికల్లో చిత్రదుర్గలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘుకుమార్‌కు 2,337 ఓట్లు వచ్చాయని, ఇప్పుడు అదే రఘుకుమార్ దొంగతనాలు చేస్తున్నాడని పోలీసు అధికారులు తెలిపారు.
లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి రెండు వేలకు పైగా ఓట్లు సంపాధించడం సామాన్యమైన విషయం కాదని, ఇప్పుడు ఇలా చోరీల కేసుల్లో చిక్కుకోవడం మాకే షాక్ గా ఉందని పోలీసు అధికారులు అంటున్నారు. రాజకీయాల్లో ఓ వెలుగు వెలగాలని అనుకుని చివరికి దొంగగా మారిన రఘుకుమార్ గురించి లోతుగా విచారణ చేస్తున్నామని, ఇతని వెనుక ఇంకా ఎంత మంది ఉన్నారు అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications