Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bengaluru: జాగ్రత్తగా ఉంటే సరేసరి, ఐటీ హబ్ లో ఎక్కడో చూస్తే ఇక్కడే కారిపోతుంది ?

బెంగళూరులో ఇంటి పనిలో చేరి దొంగతనాలకు పాల్పడుతున్న నేపాల్ దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. యజమానిని నమ్మించి మాయమాటలు చెప్పి ఆయనకు సన్నిహితుడు అయ్యాడు.

బెంగళూరు/నేపాల్: బెంగళూరులో ఇంటి పనిలో చేరి దొంగతనాలకు పాల్పడుతున్న నేపాల్ దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. నేపాల్‌కు చెందిన దంపతులు బికాస్‌, అతని భార్య సుక్ష్మితలను జయనగర్ పోలీసులు ఓ చోరీ కేసులో అరెస్టు చేశారు.

జయనగర్ ఐదోవ బ్లాక్ లోని ఓ ఇంట్లో చేరిన బికాస్ అతని యజమానిని నమ్మించి మాయమాటలు చెప్పి ఆయనకు సన్నిహితుడు అయ్యాడు. అనంతరం ఇంట్లో యజమాని లేని సమయంలో దొంగతనం చేసిన నేపాల్ దంపతులు పరారైనారి పోలీసులు అన్నారు. నేపాల్‌కు చెందిన దంపతులు వారి యజమాని ఇంట్లోని బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను అపహరించి పరారయ్యారు.

 A little neglect in Bengaluru is all it takes, jewelry and cash jump.

కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన జయనగర్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితుల నుంచి 21 లక్షల విలువైన 192 గ్రాముల 168 గ్రాముల వెండి బంగారు ఆభరణాలు, 18 బ్రాండెడ్ వాచీలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈలోగా పరారీలో ఉన్న మరో నిందితుడు హేమంత్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

బెంగళూరులో తరచూ చోరీ కేసులు నమోదవుతున్నాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడిన దుండగులు లాకర్‌లోని రూ. 5 లక్షల నగదు లూటీ చేశారు. పనిలో పనిగా నిందితులు ఐదు లక్షల నగదుతో సహా రూ. 11.75 లక్షల విలువైప బంగారు నగలు లూటీ చేశారని కేసు నమోదు అయ్యింది.

బెంగళూరు శాంతినగర్‌లోని స్వస్తిక్ క్రాస్‌లో ఉపాధ్యాయురాలు అనుపమ ఇంటిలో దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఫిర్యాదుదారు అనుపమా ఊరికి వెళ్లి ఫిబ్రవరి 7వ తేదీ ఉదయం ఇంటికి వచ్చింది. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు పని నిమిత్తం జయనగర్‌కు వెళ్లారు. ఎప్పటిలాగే అనుపమ వృద్ధ తల్లిదండ్రులు సాయంత్రం లాల్‌బాగ్ తోటలో విహారయాత్రకు వెళ్లారు. రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన తరువాత ఇళ్లు లూటీ అయిన విషయం వెలుగు చూడటంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+