బ్రాహ్మణులపై కామెంట్స్: జైలుపాలైన ముఖ్యమంత్రి తండ్రికి బెయిల్..

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ తండ్రి నంద్ కుమార్ బఘేల్‌కు బెయిల్ లభించింది. ఈ సాయంత్రం రాయ్‌పూర్‌లోని ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. బ్రాహ్మ‌ణ సామాజిక వర్గాన్ని కించ‌ప‌రిచేలా వ్యాఖ్య‌లు చేసిన‌ కారణంతో భూపేశ్ బ‌ఘేల్ తండ్రిని ఆ రాష్ట్ర‌ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంత‌రం ఆయ‌న‌ను రాయ్‌పూర్ కోర్టుకు హాజ‌రుప‌రిచారు. న్యాయస్థానం ఆయ‌నకు 15 రోజుల జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీ విధించింది.

ముఖ్యమంత్రి తండ్రి అరెస్ట్ కావడం అనేది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కన్నతండ్రిని జైలుకు పంపించిన ముఖ్యమంత్రిగా భూపేష్ బఘేల్ గుర్తింపు పొందారు. చట్టం ఎవ్వరికైనా సమానంగానే వర్తిస్తుందని భూపేష్ బఘేల్ నిరూపించారనే వ్యాఖ్యలు వినిపించాయి. ఇటీవ‌ల ఉత్త‌ర‌ ప్ర‌దేశ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన నంద‌కుమార్ బ‌ఘేల్ బ్రాహ్మ‌ణుల‌ను దేశం నుంచి బ‌హిష్క‌రించాలని పరోక్షంగా కామెంట్స్ చేశారు. వారిని గంగా నది తీర ప్రాంతం నుంచి ఓల్గా నది వరకు పంపించాలని చెప్పారు.

బ్రాహ్మణులు విదేశీయులని, నిజమైన భారతీయులను వారు అంట‌రాని ప‌రిగ‌ణిస్తారని చెప్పారు. మిగిలిన సామాజిక వర్గ ప్రజల హ‌క్కుల‌ను లాగేసుకుంటున్నారని మండిపడ్డారు. బ్రాహ్మ‌ణులను గ్రామాల్లోకి అడుగుపెట్ట‌నివ్వొద్దని నంద్ కుమార్ బఘేల్ గ్రామస్తులకు సూచించారు. ఈ విషయంపై తాను గ్రామాల్లో పర్యటించి.. స్థానికులను చైతన్యపరుస్తాననీ పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది.

A lower court grants bail to Chhattisgarh CM Bhupesh Baghel’s father Nand Kumar Baghel

కొందరు బ్రాహ్మణులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో చత్తీస్‌గఢ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కన్నతండ్రిపై కేసు నమోదు చేయడాన్ని ముఖ్యమంత్రి సమర్థించుకున్నారు. వ్యక్తుల కంటే చట్టం అత్యున్నతమైందని, అందరికీ సమానమైనది వ్యాఖ్యానించారు. పోలీసులు నంద్ కుమార్ బఘేల్‌ను రాయ్‌పూర్ న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా.. ఆయనను 15 రోజుల పాటు రిమాండ్‌కు తరలించింది. తాజాగా ఈ సాయంత్రం బెయిల్‌ను మంజూరు చేసింది.

కన్నతండ్రిని అరెస్ట్ చేయడం పట్ల దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించారు భూపేష్ బఘేల్. చట్టం కంటే ఎవరూ అతీతులు కారనే విషయాన్ని ఆయన నిరూపించారని ప్రశంసించారు. బ్రాహ్మణులపై ఘాటు వ్యాఖ్యలు చేసిన నంద్ కుమార్‌ బఘేల్‌ను అడ్డుగా పెట్టుకుని భూపేష్ బఘేల్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టిన భారతీయ జనతా పార్టీ నేతలకు.. వాటిని సంధించే అవకాశాన్ని ఇవ్వలేదు. తండ్రిని అరెస్ట్ చేయించడంతో బీజేపీ నేతలు ఆరోపణలు చేయడానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదాయన.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+