Beautiful Video : 2026 తొలి సూర్యోదయం
2026 వచ్చేసింది. కొత్త ఆశలు, కొత్త ఆలోచనలతో తొలి రోజు ప్రారంభించాం మనమంతా. అయితే డిసెంబర్ 31 నైట్ మంచిగా న్యూ ఇయర్ పార్టీ చేసుకున్న వారు 2026 తొలి సూర్యోదయాన్ని మాత్రం మిస్ అయ్యారు. ఎందుకంటే కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుని అంతా నిద్రపోయే సరికే ఉదయం 4 లేదా 5 గంటలు దాచేసింది కూడా. మరి అలాంటప్పుడు 2026 తొలి సన్ రైజ్ ను ఎలా చూస్తాం అని కామన్ గా అందరూ అంటారు. అయితే మీ కోసం సూర్యోదయాన్ని తీసుకురాలేను కానీ.. ఆ అద్భుత దృశ్యాన్ని మాత్రం మీ ముందు ఉంచుతున్నాను
ప్రకృతి చాలా అందమైనది. కళ్లకు కనిపించే అందాన్ని వర్ణించలేనంత సుందరమైనది. 2026 కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు ఉదయించాలంటే ఈ కొత్త సూర్యోదయాన్ని అందరం కచ్చితంగా చూసి తీరాల్సిందే. అస్సాంలోని గౌహతిలో ఆవిష్కృతమైన ఈ ఏడాది తొలి సూర్యోదయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెల్లవారుజామున ఆకాశం నుంచి కురుస్తున్న మంచు తెరలను చేదించుకుంటూ తొలి పొద్దు సూర్య కిరణాలు భూమిని తాకిన తరుణం అమోఘం.. అనిర్వచనీయం
#WATCH | Assam | First sunrise of 2026 as seen from Guwahati pic.twitter.com/43vidO5R46
— ANI (@ANI) January 1, 2026
మరోవైపు దేశ తూర్పు తీరాన ఉన్న కొలువై ఉన్న పూరీ జగన్నాథ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. జగన్నాథుని ఆశీస్సుల కోసం తరలి వచ్చిన భక్తులకు సూర్య భగవానుడి తొలి దర్శనం అందింది. సముద్రం తీరం నుంచి సన్ రైజ్ చూస్తున్న వారికి వెంట్రుకలు నిక్కబొడుచుకున్న అనుభూతి కలిగింది. ఆ వీడియో చూస్తేనే ఎంతదంగా ఉంది కదా అని అందరం అనుకుంటాం.
#WATCH | Odisha | First sunrise of 2026 as seen from Puri pic.twitter.com/zjbIPss7FY
— ANI (@ANI) January 1, 2026

శ్రీరాముడు కొలువైన అయోధ్యలో కూడా చూడముచ్చటైన సూర్యోదయం కనిపించింది. ఆ అయోధ్య రాముడి ఆలయ శిఖరం నుంచి సూర్య భగవానుడిని చూస్తూ చేతులెత్తి మొక్కుతున్నారు భక్తులు.
#WATCH | Uttar Pradesh: Visuals of the first sunrise of the year 2026 from Ayodhya. pic.twitter.com/mP8U5mhjjw
— ANI (@ANI) January 1, 2026
ఇక ఏపీలో కూడా అద్భుతమైన సూర్యోదయం ఈ రోజు కనిపించింది. ప్రకృతి ప్రేమికులు ఎంతగానో కలవరించే అరకు లోయ ఇందుకు సాక్ష్యంగా నిలిచింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వావ్ అనిపిస్తుంది. ఎత్తైన కొండల్లో నుంచి మేఘాలను దాటుకుంటూ వచ్చిన సూర్యుడు.. ఆ ప్రాంతం మొత్తాన్ని బంగారు వర్ణంలోకి మార్చేశాడు. ఇంతటి అద్బుతమైన సన్ రైజ్ చూసిన తర్వాత ఇప్పటి వరకు అరకు వెళ్లని వారికి కచ్చితంగా ఈ సీజన్ లో వెళ్లాలనే కోరిక పుట్టేలా చేస్తుంది.
The first sunrise of 2026, from the Sunrise State! (Araku valley, Andhra Pradesh). pic.twitter.com/4WkXqicJQP
— N Chandrababu Naidu (@ncbn) January 1, 2026












Click it and Unblock the Notifications