parents: తల్లిదండ్రుల కళ్లముందే బాలుడిని నేలకు వేసి కొట్టి చంపేసిన మంత్రగాడు, నరబలి ?
అనారోగ్యంతో ఉన్న కొడుకును మంత్రగాడి దగ్గరకు తీసుకెళ్లారు. తల్లిదండ్రుల కళ్ల ముందే వారి చిన్నారిని మంత్రగాడు దారుణంగా హత్య చేసిన తీరు కలకలం రేపింది.
లక్నో/ఉత్తరప్రదేశ్: సాంకేతికపరంగా ప్రపంచ దేశాలు పోటాపోటీగా దూసుకుపోతున్నాయి. ప్రపంచ దేశాల్లో ఐటీ హబ్ గా భారతదేశానికి ప్రత్యేక మైన గుర్తింపు ఉంది. దేశ విదేశాల్లో భారతీయులు సాఫ్ట్ వేర్ రంగంలో వారి సత్తా చాటుకుంటున్నారు. ఇలాంటి భారతదేశంలో చేతబడులు. నరబలి, క్షుద్రపూజలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తల్లిదండ్రుల కళ్ల ముందే వారి చిన్నారిని మంత్రగాడు దారుణంగా హత్య చేసిన తీరు కలకలం రేపింది.
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లా గోదావలిలో జితేంద్ర అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. జితేంద్రకు ఏడాది వయసున్న అనూజ్ అనే కుమారుడు ఉన్నాడు. అనూజ్ తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అదే ఊరికి చెందిన మాంత్రికుడు అజయ్ వద్దకు చిన్నారిని తీసుకెళ్తే వ్యాధి నయమవుతుందని స్థానికులు కొందరు జితేంద్రకు సూచించారు.

ఇది విన్న జితేంద్ర దంపతులు చిన్నారిని మాంత్రికుడు అజయ్ వద్దకు తీసుకెళ్లారు. మాంత్రికుడు జితేంద్ర ముందుగా ఓ పాత్రలోంచి కొంత ద్రవాన్ని తీసుకుని చిన్నారి అనూజ్ నోటిలో వేశాడు. తరువాత అనూజ్ కు మంత్రవిద్య ద్వారా వ్యాధి నయం అవుతుందని చెప్పాడు. తరువాత పిల్లాడు అనూజ్ పళ్ళు విరిగిలా నేలపై విసిరే కొట్టిన మంత్రగాడు అజయ్ క్రూరమైన చర్యలకు పాల్పడ్డాడు.
భయాందోళనకు గురైన తల్లిదండ్రులు చిన్నారి అనూజ్ ను ఆస్పత్రికి తరలించారు. మాంత్రికుడు అజయ్ దాడి చెయ్యడంతో చిన్నారి అనూజ్ పరిస్థితి విషమించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తమ చిన్నారి అనూజ్ ప్రాణాలను బలిగొన్న మంత్రగాడు అజయ్ మీద తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాంత్రికుడు అజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి హత్య కేసు నమోదు చేశారు. మంత్రగాడు అజయ్ చేతిలో చిన్నారి హత్యకు గురి కావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. అయితే ఏదైనా పూజలు చేస్తున్న మంత్రగాడు అజయ్ తల్లిదండ్రులకు తెలీకుండా వాళ్ల ఏడాది కుమారుడిని నరబలి ఇచ్చాడా ? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications